ఓబులవారిపల్లి ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
ఓబులవారిపల్లి మండలంలోని మంగంపేట పారిశ్రామికవాడలో ఏఐటియుసి త్రివేణి కార్మిక సంఘం గురువారం ఆగస్టు 28, 2000న హైదరాబాద్ బషీర్ బాగ్ లో జరిగిన కాల్పుల్లో అమరులైన కార్మికులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించింది. ఈ సందర్భంగా ఏఐటియుసి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మాదరాజు గంగాధర్ మాట్లాడుతూ, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు షరతులు అమలు చేస్తూ విద్యుత్ చార్జీలను భారీగా పెంచారని, దానిని వ్యతిరేకిస్తూ వామపక్షాలు ఉద్యమించాయని తెలిపారు.


