నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజు కొన్ని శాఖల ద్వారా జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈనెల 23న బుద్ధవనంలో ప్రత్యేకంగా బతుకమ్మ ఉత్సవాలను, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 23న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ,డిసీహెచ్ఎస్, యువజన సర్వీసులు, కార్మిక శాఖలు, ఎన్జీ కళాశాల మైదానంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించాలని, 24న వ్యవసాయ,ఉద్యాన,
సెరికల్చర్, హ్యాండ్లూమ్స్, పశుసంవర్ధక శాఖలు, 25న మున్సిపల్, ట్రాన్స్కో ఫిషరీస్, సంక్షేమ శాఖలు, ఆధ్వర్యంలో నిర్వహించాలని,26న డిఆర్డిఓ,డిపిఓ,సిపిఓ, ఆర్టీసీ,మెప్మా శాఖలు నిర్వహించాలని, 27న అటవీశాఖ, పోలీస్, ఎక్సైజ్, ఫైర్, ఆర్డిఓ శాఖలు నిర్వహించాలని,28న రెవెన్యూ, దేవాదాయ,సహకార, పౌర సంబంధాల, టీఎన్జీవో, సర్వే ల్యాండ్ రికార్డ్స్ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలన్నారు.
29న జిల్లా విద్యాశాఖ, అన్ని ఇంజనీరింగ్ శాఖలు, మెప్మా తో కలిసి కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈనెల 30న బార్ అసోసియేషన్, రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు.
నల్గొండ ఆర్డిఓ బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, మున్సిపల్ కమిషనర్, ఎన్ జి కళాశాల మైదానంలో లైటింగ్, డయాస్, తాగునీరు, ఇతర ఏర్పాటు చేయాలని, పోలీస్ శాఖ తరపున అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
బుద్ధవనంలో నిర్వహించే బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా మిర్యాలగూడ సబ్ కలెక్టర్
నందికొండ మున్సిపల్ కమిషనర్, బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్, పెద్దవూర తహసిల్దార్ లు, ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్న : జిల్లా కలెక్టర్
నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజు కొన్ని శాఖల ద్వారా జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈనెల 23న బుద్ధవనంలో ప్రత్యేకంగా బతుకమ్మ ఉత్సవాలను, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 23న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ,డిసీహెచ్ఎస్, యువజన సర్వీసులు, కార్మిక శాఖలు, ఎన్జీ కళాశాల మైదానంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించాలని, 24న వ్యవసాయ,ఉద్యాన, సెరికల్చర్, హ్యాండ్లూమ్స్, పశుసంవర్ధక శాఖలు, 25న మున్సిపల్, ట్రాన్స్కో ఫిషరీస్, సంక్షేమ శాఖలు, ఆధ్వర్యంలో నిర్వహించాలని,26న డిఆర్డిఓ,డిపిఓ,సిపిఓ, ఆర్టీసీ,మెప్మా శాఖలు నిర్వహించాలని, 27న అటవీశాఖ, పోలీస్, ఎక్సైజ్, ఫైర్, ఆర్డిఓ శాఖలు నిర్వహించాలని,28న రెవెన్యూ, దేవాదాయ,సహకార, పౌర సంబంధాల, టీఎన్జీవో, సర్వే ల్యాండ్ రికార్డ్స్ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలన్నారు. 29న జిల్లా విద్యాశాఖ, అన్ని ఇంజనీరింగ్ శాఖలు, మెప్మా తో కలిసి కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈనెల 30న బార్ అసోసియేషన్, రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. నల్గొండ ఆర్డిఓ బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, మున్సిపల్ కమిషనర్, ఎన్ జి కళాశాల మైదానంలో లైటింగ్, డయాస్, తాగునీరు, ఇతర ఏర్పాటు చేయాలని, పోలీస్ శాఖ తరపున అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బుద్ధవనంలో నిర్వహించే బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నందికొండ మున్సిపల్ కమిషనర్, బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్, పెద్దవూర తహసిల్దార్ లు, ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

