ప- అక్షరాలు దిద్దగా లక్షణాలు అబ్బగ
ఎక్కాలు నేర్చగ ప్రగతి బాట పట్టగ
చదువులమ్మ పిలుస్తుంది తన ఒడికి
వెళదాము రండి మనం మన బడికి (అక్ష)
చ1- కోయిలమ్మ పాడుతున్న రాగాల తీరుగ
పంతులమ్మ చెబుతున్న పాఠాలు వినగ
వినయ విధేయతలు కల్గి సద్విద్య ఒంటబట్టి
సంక్షేమ సమాజాన సజ్జనుడివి కాగ (అక్ష)
చ2- భరత భూమి గడ్డమీద నడవాలి సరిగ
నేర్పుతుంది మనబడి జీవించ నిండుగ
పరిసరాల విజ్ఞానం విచక్షనే చైతన్యం
విజ్ఞాన సముపార్జన నీ లక్ష్యం అవగ (అక్ష)*


