Thursday, 26 March 2026
  • Home  
  • ఫ్లెక్సీల రగడ..!* *ఎల్బీనగర్ లో రెండుగా చీలిపోయిన కాంగ్రెస్ పార్టీ* *నూతన సంవత్సర ఫ్లెక్సీల ఏర్పాట్లలో ఫోటోల యుద్ధం*
- E-పేపర్

ఫ్లెక్సీల రగడ..!* *ఎల్బీనగర్ లో రెండుగా చీలిపోయిన కాంగ్రెస్ పార్టీ* *నూతన సంవత్సర ఫ్లెక్సీల ఏర్పాట్లలో ఫోటోల యుద్ధం*

*ఫ్లెక్సీల రగడ..!* *ఎల్బీనగర్ లో రెండుగా చీలిపోయిన కాంగ్రెస్ పార్టీ* *నూతన సంవత్సర ఫ్లెక్సీల ఏర్పాట్లలో ఫోటోల యుద్ధం* *తమ వారి ఫోటోలు పెట్టలేదు అంటూ అర్ధరాత్రి ఫ్లెక్సీలను చించివేసిన వైనం* *ఒకరిపై ఒకరు ఫిర్యాదులు* *తల పట్టుకుంటున్న పోలీసులు* *జక్కిడి – మధు యాష్కి రెండు వర్గాల మధ్య యుద్ధ పోరు* *అధికార వర్గాల మధ్య పోరుతో పోలీసులకు చెమటలు* పున్నమి ప్రతినిధి : ఎల్బీనగర్ లో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. ఒకటి జక్కిడి వర్గం.. రెండోది మధుయాష్కి వర్గం అనే విషయం తేటతెల్లమైంది. గత కొంతకాలంగా మధుయాష్కి గౌడ్ ఎల్బీనగర్ రాజకీయంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో కొన్ని ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీకి విధేయతగా పనిచేస్తున్న జక్కిడి ప్రభాకర్ రెడ్డి కుటుంబం కూడా పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కానీ నిజామాబాద్ నుంచి వలస వచ్చిన మధుయాష్కి గౌడ్ ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని తన గుప్పెట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే గత ఎన్నికలలో మధుయాష్కి గౌడ్ ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. దీనికి కారణం స్థానిక నాయకులు ఆయనకు సహకరించ లేదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక అప్పటి నుండి ఆయన తన సొంత క్యాడర్ ని పెంచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కొంత మంది తన అభిమానులు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మన్సురాబాద్ డివిజన్ లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అందులో జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో గాని, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఫోటో గాని లేకపోవడంతో జక్కిడి ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చెందారు. అర్థరాత్రి మధుయాష్కీకి అనుకూలంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో మధుయాష్కిగౌడ్ వర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఫ్లెక్సీలను చించివేసిన వారిని గుర్తించి పోలీసులు కేసులు నమోదు చేశారు. *బహిర్గతమైన వర్గ విభేదాలు..* ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలు బట్టబయలు అయ్యాయి. గత ఎన్నికల్లో కలిసి కట్టుగా పని చేస్తున్నట్టు ప్రజలంతా అనుకున్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు తారస్థాయికి చేరింది. ఎల్బీనగర్ లో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయిందని ప్రజలు అనుకుంటున్నారు. ఒకటి మధు యాష్కి వర్గం, మరొకటి జక్కిడి వర్గం అనేది ఫ్లెక్సీల రగడతో చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు వర్గాలలో స్థానిక కాంగ్రెస్ క్యాడర్ ఎవరి పక్షాన ఉంటారో.. అనేది ఇంకా సందిగ్ధమే..! కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తీర్చుకోవాలి మరి.. *తారాస్థాయికి వర్గ పోరు..!* కాంగ్రెస్ అంటేనే వర్గ పోరాటాలకు నిలయం. అయితే ఇంతకాలం ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వర్గ పోరు ఎప్పుడూ ప్రజలు చూసి ఉండరు. కానీ.. ఎప్పుడైతే మధు యాష్కిగౌడ్ రూపంలో చూడాల్సి వచ్చింది అంటూ మొక్కున వేలేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో మధుయాష్కీ గౌడ్ ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పటి నుండి వర్గ పోరు మొదలైంది. ఎంతో కాలంగా ఈ నియోజకవర్గాన్ని నమ్ముకొని పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మధుయాష్కి గౌడ్ రాకతో నిరుత్సాహంలో పడిపోయారు. కాంగ్రెస్ అధిష్టానం ఏండ్ల తరబడి కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న నాయకులను కాదని.. వలస వచ్చిన నేతకు అవకాశం ఇవ్వడంతో ఎవరు మనస్ఫూర్తిగా పని చేయలేకపోయారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటమి చెందినా.. మధుయాష్కి గౌడ్ నియోజకవర్గాన్ని వదలకుండా గత కొంత కాలంగా నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలకు నచ్చడం లేదు. అందులో భాగంగానే ఆయనపై కాంగ్రెస్ పార్టీలోనే వ్యతిరేకత బయటపడుతుంది. మునుముందు ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో.. వేచి చూడాలి మరి..?

*ఫ్లెక్సీల రగడ..!*
*ఎల్బీనగర్ లో రెండుగా చీలిపోయిన కాంగ్రెస్ పార్టీ*
*నూతన సంవత్సర ఫ్లెక్సీల ఏర్పాట్లలో ఫోటోల యుద్ధం*
*తమ వారి ఫోటోలు పెట్టలేదు అంటూ అర్ధరాత్రి ఫ్లెక్సీలను చించివేసిన వైనం*
*ఒకరిపై ఒకరు ఫిర్యాదులు*
*తల పట్టుకుంటున్న పోలీసులు*
*జక్కిడి – మధు యాష్కి రెండు వర్గాల మధ్య యుద్ధ పోరు*
*అధికార వర్గాల మధ్య పోరుతో పోలీసులకు చెమటలు*

పున్నమి ప్రతినిధి :
ఎల్బీనగర్ లో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. ఒకటి జక్కిడి వర్గం.. రెండోది మధుయాష్కి వర్గం అనే విషయం తేటతెల్లమైంది. గత కొంతకాలంగా మధుయాష్కి గౌడ్ ఎల్బీనగర్ రాజకీయంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో కొన్ని ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీకి విధేయతగా పనిచేస్తున్న జక్కిడి ప్రభాకర్ రెడ్డి కుటుంబం కూడా పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కానీ నిజామాబాద్ నుంచి వలస వచ్చిన మధుయాష్కి గౌడ్ ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని తన గుప్పెట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే గత ఎన్నికలలో మధుయాష్కి గౌడ్ ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. దీనికి కారణం స్థానిక నాయకులు ఆయనకు సహకరించ లేదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక అప్పటి నుండి ఆయన తన సొంత క్యాడర్ ని పెంచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కొంత మంది తన అభిమానులు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మన్సురాబాద్ డివిజన్ లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అందులో జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో గాని, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఫోటో గాని లేకపోవడంతో జక్కిడి ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చెందారు. అర్థరాత్రి మధుయాష్కీకి అనుకూలంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో మధుయాష్కిగౌడ్ వర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఫ్లెక్సీలను చించివేసిన వారిని గుర్తించి పోలీసులు కేసులు నమోదు చేశారు.
*బహిర్గతమైన వర్గ విభేదాలు..*
ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలు బట్టబయలు అయ్యాయి. గత ఎన్నికల్లో కలిసి కట్టుగా పని చేస్తున్నట్టు ప్రజలంతా అనుకున్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు తారస్థాయికి చేరింది. ఎల్బీనగర్ లో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయిందని ప్రజలు అనుకుంటున్నారు. ఒకటి మధు యాష్కి వర్గం, మరొకటి జక్కిడి వర్గం అనేది ఫ్లెక్సీల రగడతో చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు వర్గాలలో స్థానిక కాంగ్రెస్ క్యాడర్ ఎవరి పక్షాన ఉంటారో.. అనేది ఇంకా సందిగ్ధమే..! కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తీర్చుకోవాలి మరి..
*తారాస్థాయికి వర్గ పోరు..!*
కాంగ్రెస్ అంటేనే వర్గ పోరాటాలకు నిలయం. అయితే ఇంతకాలం ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వర్గ పోరు ఎప్పుడూ ప్రజలు చూసి ఉండరు. కానీ.. ఎప్పుడైతే మధు యాష్కిగౌడ్ రూపంలో చూడాల్సి వచ్చింది అంటూ మొక్కున వేలేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో మధుయాష్కీ గౌడ్ ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పటి నుండి వర్గ పోరు మొదలైంది. ఎంతో కాలంగా ఈ నియోజకవర్గాన్ని నమ్ముకొని పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మధుయాష్కి గౌడ్ రాకతో నిరుత్సాహంలో పడిపోయారు. కాంగ్రెస్ అధిష్టానం ఏండ్ల తరబడి కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న నాయకులను కాదని.. వలస వచ్చిన నేతకు అవకాశం ఇవ్వడంతో ఎవరు మనస్ఫూర్తిగా పని చేయలేకపోయారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటమి చెందినా.. మధుయాష్కి గౌడ్ నియోజకవర్గాన్ని వదలకుండా గత కొంత కాలంగా నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలకు నచ్చడం లేదు. అందులో భాగంగానే ఆయనపై కాంగ్రెస్ పార్టీలోనే వ్యతిరేకత బయటపడుతుంది. మునుముందు ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో.. వేచి చూడాలి మరి..?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.