ఖమ్మం జనవరి
(పున్నమి ప్రతి నిధి)
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు అధికారికంగా లేఖ రాసింది.
ప్రభుత్వ ప్రతిపాదనలపై పరిశీలన అనంతరం, ఎన్నికల కమిషన్ మూడురోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. షెడ్యూల్ వెలువడితే రాష్ట్రవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రానుంది.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో ఉత్సాహం నెలకొనగా, అభ్యర్థుల ఎంపిక, వ్యూహాల రూపకల్పనలో పార్టీలు బిజీగా మారాయి. ఎన్నికల తేదీలు ఖరారైతే స్థానిక సంస్థల రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.



