చిట్వేలి (పున్నమి ప్రతినిధి) జూలై 19
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం ప్రభుత్వ కార్యాలయాల యందు “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిని పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చిట్వేల్ నందు “ప్లాస్టిక్ వాడకానికి స్వస్తి పలుకుదాం”అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మానవులు నేడు విచక్షణారహితంగా ప్లాస్టిక్ ని వాడడం వలన పర్యావరణం సమతుల్యం దెబ్బతింటుందని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని చిట్వేల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. దుర్గ రాజు అన్నారు.తెలుగు ఉపాధ్యాయురాలు బి.విజయలక్ష్మి విద్యార్థులకు ఒక చిన్న కృత్యం ద్వారా ప్లాస్టిక్ మరియు పేపర్ యొక్క జీవిత కాలం గురించి వాటి నష్టాల గురించి చక్కగా ప్రదర్శించడం జరిగింది. అలాగే జీవశాస్త్ర ఉపాధ్యాయులు ఎ.కళావతి, టి.సుహాసిని ఎ.శివన్నారాయణ లు విద్యార్థులచే పర్యావరణాన్ని ప్లాస్టిక్ భూతం నుంచి ఎలా కాపాడాలో నినాదాల ద్వారా ప్రజలలో అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ తరువాత విద్యార్థులచే ప్లాస్టిక్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలో, ఎలాంటి వస్తువులు ఉపయోగించాలో , ప్లాస్టిక్ ని విరివిగా ఉపయోగించడం వలన సంభవించే దుష్పరిణామాల గురించి వివరించడం జరిగింది.ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయంగా ఆరోగ్యకరమైన జీవితం కోసం ఎలాంటి వస్తువులు వాడాలో విద్యార్థులు చూపించడం జరిగింది. విద్యార్థుల యొక్క ప్రదర్శన వారు చేసిన నినాదాలు ప్రజలను ఎంతగానో ఆకర్షించాయి.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు, జీవ శాస్త్ర ఉపాధ్యాయులు లక్ష్మీ కళావతి,సుహాసిని,శివ నారాయణ,చిన్న బాబు మొదలగు ఉపాధ్యాయ బృందంతో పాటు ICDS సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు..

ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం.
చిట్వేలి (పున్నమి ప్రతినిధి) జూలై 19 రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం ప్రభుత్వ కార్యాలయాల యందు “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిని పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చిట్వేల్ నందు “ప్లాస్టిక్ వాడకానికి స్వస్తి పలుకుదాం”అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మానవులు నేడు విచక్షణారహితంగా ప్లాస్టిక్ ని వాడడం వలన పర్యావరణం సమతుల్యం దెబ్బతింటుందని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని చిట్వేల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. దుర్గ రాజు అన్నారు.తెలుగు ఉపాధ్యాయురాలు బి.విజయలక్ష్మి విద్యార్థులకు ఒక చిన్న కృత్యం ద్వారా ప్లాస్టిక్ మరియు పేపర్ యొక్క జీవిత కాలం గురించి వాటి నష్టాల గురించి చక్కగా ప్రదర్శించడం జరిగింది. అలాగే జీవశాస్త్ర ఉపాధ్యాయులు ఎ.కళావతి, టి.సుహాసిని ఎ.శివన్నారాయణ లు విద్యార్థులచే పర్యావరణాన్ని ప్లాస్టిక్ భూతం నుంచి ఎలా కాపాడాలో నినాదాల ద్వారా ప్రజలలో అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ తరువాత విద్యార్థులచే ప్లాస్టిక్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలో, ఎలాంటి వస్తువులు ఉపయోగించాలో , ప్లాస్టిక్ ని విరివిగా ఉపయోగించడం వలన సంభవించే దుష్పరిణామాల గురించి వివరించడం జరిగింది.ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయంగా ఆరోగ్యకరమైన జీవితం కోసం ఎలాంటి వస్తువులు వాడాలో విద్యార్థులు చూపించడం జరిగింది. విద్యార్థుల యొక్క ప్రదర్శన వారు చేసిన నినాదాలు ప్రజలను ఎంతగానో ఆకర్షించాయి.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు, జీవ శాస్త్ర ఉపాధ్యాయులు లక్ష్మీ కళావతి,సుహాసిని,శివ నారాయణ,చిన్న బాబు మొదలగు ఉపాధ్యాయ బృందంతో పాటు ICDS సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు..

