సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి)
ప్రింట్ చేసిన బిల్లులు, ఏటీఎం స్లిప్లకు ఉపయోగించే థర్మల్ పేపర్లో హానికర బిస్ఫినాల్స్, బీపీఏ రసాయనాలు ఉంటాయని, ఇవి చర్మం ద్వారా సులువుగా రక్తంలోకి చేరగలవని ముంబై వోకార్ట్ ఆస్పత్రి వైద్యుడు అనికేత్ మూలే తెలిపారు.
ఈ రసాయనాల్లో హార్మోన్ల సమతుల్యత, ఫెర్టిలిటీని దెబ్బతీసే గుణాలతో పాటు క్యాన్సర్ కారకాలూ ఉంటాయన్నారు.
అందుకే తమ ఉత్పత్తులు బీపీఏ ఫ్రీ అని కంపెనీలు ప్రత్యేకంగా చెబుతాయన్నారు.


