Friday, 3 April 2026
  • Home  
  • ప్రాణదాతలను సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తా* ఎం ల్ ఎ వెలగపూడి
- విశాఖపట్నం

ప్రాణదాతలను సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తా* ఎం ల్ ఎ వెలగపూడి

*ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వెలగపూడి* *పలువురు వైద్యులు.. గురువులకు ఘనంగా సత్కారం* విశాఖపట్నం అక్టోబర్పున్నమి ప్రతినిధి: సమాజంలో ఎంతోమందికి ప్రాణదాతలుగా నిలుస్తున్న వైద్యులను తన చేతుల మీదుగా సత్కరించుకోవడం అభినందనీయమని విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. ఆదివారం ఇక్కడ ఎంవిపి కాలనీలో ప్రముఖ పలమనాలజిస్ట్ కేత ఫణిందర్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం పలువురు వైద్యులను.. గురువులను రామకృష్ణ బాబు చేతుల మీదుగా సత్కరించారు.. ఈ సందర్భంగా వెలగపూడి మాట్లాడుతూ కరోనా సమయంలో ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిన ఘనత డాక్టర్ ఫణీందర్ కు దక్కుతుందన్నారు. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రత్యక్ష ..పరోక్ష పద్ధతిలో అనేకమంది రోగులకు ఆయన సేవలు అందించారు అన్నారు. అందుకు ఆయనకు అనేక అవార్డులు లభించినట్లు చెప్పారు… అలాగే ఇప్పుడు తన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు రక్తదాన శిబిరం.. మందులు పంపిణీ కూడా చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.. తన చేతుల మీదుగా ఎంతోమంది సీనియర్ ప్రముఖ వైద్యులను అలాగే గురువులను సత్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. శిబిరం నిర్వహకులు డాక్టర్ కే ఫణిందర్ మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం లివర్.. లంగ్స్ ఫంక్షన్. ఎకో .. గుండెకి సంబంధించిన 16 రకాలు పరీక్షలను ఉచితంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఇందుకు మెడికవర్ .. ఇండస్ ఆసుపత్రిలు తమ వంతు సహకారం అందించినట్లు చెప్పారు.. అలాగే పలువురు వైద్యులు కూడా ఉచితంగానే తనిఖీలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఎప్పటికప్పుడు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. తమ ఆసుపత్రికి వచ్చే వారికి వీలైనంత మేరకు వైద్య సహాయం అందిస్తున్నట్లు వివరించారు . గౌరవ అతిథిగా హాజరైన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ కరోనా సమయంలో ఎంతో మంది జర్నలిస్టులుకు డాక్టర్ ఫణిందర్ సహకారం అందించారన్నారు.. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సునీత. డాక్టర్ జి సుధారాణి.. డాక్టర్ శ్వేత.. డాక్టర్ మాఊరు కృష్ణమోహన్ . వైద్యులు మాధవి లత.. విద్యాసాగర్. తనకు విద్య నేర్పిన గురువులు వసుంధర,రోహిణి తదితరులు అందరినీ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బుగత సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు బైరెడ్డి పోతన రెడ్డి, వార్డ్ అధ్యక్షులు సత్తిబాబు,. జానాపురం హోల్సేల్ మార్కెట్ కమిటీ సభ్యులు కోరుబిల్లి ప్రసాద్, యువ వైద్యులు నీరజ్ ప్రసాద్, రవి, శ్రీనివాస్ తదితరులంతా పాల్గొన్నారు

*ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వెలగపూడి*

*పలువురు వైద్యులు.. గురువులకు ఘనంగా సత్కారం*

విశాఖపట్నం అక్టోబర్పున్నమి ప్రతినిధి:

సమాజంలో ఎంతోమందికి ప్రాణదాతలుగా నిలుస్తున్న వైద్యులను తన చేతుల మీదుగా సత్కరించుకోవడం అభినందనీయమని విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. ఆదివారం ఇక్కడ ఎంవిపి కాలనీలో
ప్రముఖ పలమనాలజిస్ట్ కేత ఫణిందర్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం పలువురు వైద్యులను.. గురువులను రామకృష్ణ బాబు చేతుల మీదుగా సత్కరించారు.. ఈ సందర్భంగా వెలగపూడి మాట్లాడుతూ కరోనా సమయంలో ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిన ఘనత డాక్టర్ ఫణీందర్ కు దక్కుతుందన్నారు. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రత్యక్ష ..పరోక్ష పద్ధతిలో అనేకమంది రోగులకు ఆయన సేవలు అందించారు అన్నారు. అందుకు ఆయనకు అనేక అవార్డులు లభించినట్లు చెప్పారు… అలాగే ఇప్పుడు తన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు రక్తదాన శిబిరం.. మందులు పంపిణీ కూడా చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.. తన చేతుల మీదుగా ఎంతోమంది సీనియర్ ప్రముఖ వైద్యులను అలాగే గురువులను సత్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.
శిబిరం నిర్వహకులు
డాక్టర్ కే ఫణిందర్ మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం లివర్.. లంగ్స్ ఫంక్షన్. ఎకో .. గుండెకి సంబంధించిన 16 రకాలు పరీక్షలను ఉచితంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఇందుకు మెడికవర్ .. ఇండస్ ఆసుపత్రిలు తమ వంతు సహకారం అందించినట్లు చెప్పారు.. అలాగే పలువురు వైద్యులు కూడా ఉచితంగానే తనిఖీలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఎప్పటికప్పుడు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు.
తమ ఆసుపత్రికి వచ్చే వారికి వీలైనంత మేరకు వైద్య సహాయం అందిస్తున్నట్లు వివరించారు . గౌరవ అతిథిగా హాజరైన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ కరోనా సమయంలో ఎంతో మంది జర్నలిస్టులుకు డాక్టర్ ఫణిందర్ సహకారం అందించారన్నారు..
ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సునీత. డాక్టర్ జి సుధారాణి.. డాక్టర్ శ్వేత.. డాక్టర్ మాఊరు కృష్ణమోహన్ . వైద్యులు మాధవి లత.. విద్యాసాగర్. తనకు విద్య నేర్పిన గురువులు వసుంధర,రోహిణి తదితరులు అందరినీ ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బుగత సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు బైరెడ్డి పోతన రెడ్డి, వార్డ్ అధ్యక్షులు సత్తిబాబు,. జానాపురం హోల్సేల్ మార్కెట్ కమిటీ సభ్యులు కోరుబిల్లి ప్రసాద్, యువ వైద్యులు నీరజ్ ప్రసాద్, రవి, శ్రీనివాస్ తదితరులంతా పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.