జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ ఆధ్వర్యంలో ప్రముఖ భక్తకవి శ్రీ కనకదాసు జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందితో కలిసి కనకదాసు వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సామాజిక సమానత్వం, భక్తి మార్గం, నైతికత, మానవతా విలువలను ప్రపంచానికి చాటిచెప్పిన కనకదాసు వంటి మహనీయులు మన సమాజానికి శాశ్వత ప్రేరణ అని పాల్గొన్న అధికారులు పేర్కొన్నారు.
కనకదాసు బోధనలు నేటికీ అన్వయించుకునే విధంగా ఉండి, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బంది, యువత అందరూ ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టాలని సూచించారు. ప్రజాసేవలో నిజాయితీ, అంకితభావం, వినయంతో పనిచేయాలనే స్పూర్తిని కనకదాసు జీవితం అందిస్తుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో పాటు ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. జిల్లా పోలీసు వ్యవస్థలో సాంస్కృతిక, నైతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ ఇటువంటి కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
ఈ కార్యక్రమంలో పి.సి.ఆర్ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్సైలు ప్రసాద్, సురేష్ బాబు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


