ప్రమాదకరంగా విద్యుత్ తీగలు
పొంచి ఉన్న ప్రమాదం పట్టించుకోని జిల్లా విద్యుత్ అధికారులు
పున్నమి ప్రతినిధి – భుక్యా వినోద్ కుమార్
18నవంబర్ 2025, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
సుజాతనగర్ మండలం కోయగూడెం గ్రామపంచాయతీ పరిధిలో గల కోయగూడెం గ్రామపంచాయతీ నుంచి పెద్ద కోయగూడెంకు రోడ్డు మార్గం లో ఉన్న కరెంటు తీగలకు చెట్ల కొమ్మలు తగులుతూ ప్రమాదకరంగా ఉన్నాయి. కోయగూడెం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలకు ముందు రోడ్డు మార్గంలో చెట్ల కొమ్మలు కరెంట్ తీగలకు తాకుతూ ఉన్నాయి,
ఈ గిరిజన ఉన్నత ఆశ్రమ పాఠశాలలో సుమారుగా 300 మంది విద్యార్థులకు
విద్యాభ్యాసం జరుగుతూ ఉంటుంది, జిల్లాల నలుమూలల గిరిజన ప్రాంతాల నుంచి గిరిజన విద్యార్థులు వసతి ఉంటున్నారు?
అదే విధంగా గ్రామంలో ప్రజలు ఇదే రోడ్డు మార్గం లో నిరంతరం ప్రజలు తిరుగుతూ ఉంటారు? అయితే జిల్లా విద్యుత్ అధికారులు విద్యుత్ వైర్లకు ఉన్న చెట్ల కొమ్మలను తొలగించకపోతే ఏ సమయంలోనైనా విద్యుత్ ప్రమాదం పొంచి ఉన్నది? ప్రభుత్వ విద్యుత్ అధికారులు విద్యుత్ వైర్లపై ఉన్న చెట్ల కొమ్మలను తక్షణమే తొలగించాలని స్థానికులు కోరారు.


