- *ప్రభుత్వ లాంఛనాల మధ్య పూర్తయిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు.*
*అంత్యక్రియలకు హాజరై కన్నీటి వీడ్కోలు పలికిన సీయం*
మర్రిపాడు :పీబ్రవరి.23. (పున్నమివిలేకరి )
కడచూపు చూచుటకు పిక్కటిల్లే తట్టు తరలి వచ్చిన జనసంద్రం
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివదేహాన్ని నెల్లూరు క్యాంపు కార్యాలయం నుండి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు మరియు అభిమానుల సందర్శనార్థం ఆత్మకూరు, డి సి పల్లి,మర్రిపాడు, నెల్లూరు సరిహద్దు, బ్రాహ్మణపల్లి మీదుగా అంతిమయాత్ర నిర్వహించి ఉదయగిరి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మంత్రి అంత్యక్రియలు జరిగాయి.ఈ అంతిమ యాత్రకు మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ఎంపీ గల్లా జయదేవ్, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మరియు ఎమ్ ఎల్ ఏ లు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.ఈ అంతిమ యాత్రకు విశేష జనవాహిని తరలి వెళ్లింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి స్నేహితుడ్ని మంచి క్యాబినెట్ మినిస్టర్ ని కోల్పోయానని దిగ్భ్రాంతికి గురయ్యారు. అంతిమ యాత్రలో భాగంగా రోడ్డు పొడవునా మేకపాటి గౌతం రెడ్డి అమర్రహే అంటూ అభిమానులు, నియోజకవర్గ ప్రజలు కన్నీటి వీడ్కోలు పలకడం జరిగింది. ఈ అంతిమ యాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొని మిత్రునికి కడసారి వీడ్కోలు పలికారు.
ప్రభుత్వ లాంఛనాల మధ్య పూర్తయిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు.*
*ప్రభుత్వ లాంఛనాల మధ్య పూర్తయిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు.* *అంత్యక్రియలకు హాజరై కన్నీటి వీడ్కోలు పలికిన సీయం* మర్రిపాడు :పీబ్రవరి.23. (పున్నమివిలేకరి ) కడచూపు చూచుటకు పిక్కటిల్లే తట్టు తరలి వచ్చిన జనసంద్రం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివదేహాన్ని నెల్లూరు క్యాంపు కార్యాలయం నుండి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు మరియు అభిమానుల సందర్శనార్థం ఆత్మకూరు, డి సి పల్లి,మర్రిపాడు, నెల్లూరు సరిహద్దు, బ్రాహ్మణపల్లి మీదుగా అంతిమయాత్ర నిర్వహించి ఉదయగిరి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మంత్రి అంత్యక్రియలు జరిగాయి.ఈ అంతిమ యాత్రకు మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ఎంపీ గల్లా జయదేవ్, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మరియు ఎమ్ ఎల్ ఏ లు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.ఈ అంతిమ యాత్రకు విశేష జనవాహిని తరలి వెళ్లింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి స్నేహితుడ్ని మంచి క్యాబినెట్ మినిస్టర్ ని కోల్పోయానని దిగ్భ్రాంతికి గురయ్యారు. అంతిమ యాత్రలో భాగంగా రోడ్డు పొడవునా మేకపాటి గౌతం రెడ్డి అమర్రహే అంటూ అభిమానులు, నియోజకవర్గ ప్రజలు కన్నీటి వీడ్కోలు పలకడం జరిగింది. ఈ అంతిమ యాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొని మిత్రునికి కడసారి వీడ్కోలు పలికారు.

