జనవరి (పున్నమి ప్రతినిధి)
నూతన ఆంగ్ల సంవత్సర ఆరంభం లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరు సత్యసాయి
ఆధ్యాత్మిక కేంద్రం లో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు మూడు రోజులు జరుతున్నాయి.సభల్లో తొలి రోజు రెండవ సదస్సు తెలుగు అనువాద సాహిత్య సదస్సు కు అంతర్జాతీయ కవి, సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పెరుగు రామకృష్ణ అధ్యక్షత వహించారు.భారతీయ ఇతిహాస సాహిత్యం అనుసృజన తోనే ఆరంభమైనదని, 78 ఏళ్ల స్వాతంత్ర్య అనంతరం కూడా మన గొప్ప సాహిత్యం ప్రపంచ భాషల్లో అనువదించు కోవడం లో మనం వెనకబడ్డామని, ప్రాంతీయ భాషలు గల ప్రభుత్వాలు అనువాద అకాడెమీ లు ఏర్పాటు చేయడం ద్వారా తెలుగు సాహిత్యం ఇతర భారతీయ భాషల్లో ఇంకా ప్రపంచ వ్యాప్తం కావడం కు అవకాశం ఉంటుందని అన్నారు. ఇటువంటి సభలు అటువంటి తీర్మానాలు చేసి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకురావాలని కోరారు.అనంతరం డా పెరుగు అను వాద సాహిత్యంలో చేస్తున్న విశేష కృషిని ప్రశంసించి ఆంధ్ర సారస్వత పరిషత్ తరుపున సదస్సు సంచాలకులు పంతుల వెంకటేశ్వర రావు, ఇతర సాహితీ ప్రముఖులు కలిసి రామకృష్ణను ఆంధ్ర సారస్వత సేవా పురస్కారం, పతకం, ప్రశంసాపత్రం లతో ఘనంగా సత్కరించారు . ఈ సందర్భంగా పలువురు డా పెరుగు రామకృష్ణ ను అభినందించారు..!


