కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో పేదప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన అంగీకార్ - 2025 పధకాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అనకాపల్లి నియోజకవర్గం సంస్థాగత ఎన్నికల పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు.
భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశానుసారం భీమిలి జోన్ 3వ డివిజన్ ఎగువపేట గ్రామంలో అంగీకార్ -2025 పధకంలో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజనపై ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం హోసింగ్ అధికారుల సమక్షంలో జరగగా ముఖ్య అతిధులుగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, 3వ వార్డు కార్పొరేటర్ గంటా అప్పలకొండ పాల్గొన్నారు. ఈ సందర్బంగా గంటా నూకరాజు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం ఎన్నో అదునాతన పధకాలు ప్రవేశపెడుతున్నాయని అన్నారు. అందులో భాగమే అంగీకార్ - 2025 అని అన్నారు. ఈ పధకంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, సోలార్, తడిచెత్త-పొడిచెత్త సేకరణ ఉన్నాయని అన్నారు. హోసింగ్ ద్వారా ఒక్కొక్క లబ్ధిదారునికి 2,50,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుందని అన్నారు. ఈ పధకం ఈ ఏడాది డిసెంబర్ నుండి ప్రారంభమవుతుందని చెప్పారు. మీ స్థలంకి సంబందించిన వివరాలు, మీ వ్యక్తిగత వివరాలు తీసుకొని మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ పధకం అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. అదేవిదంగా విద్యుత్ ఆదాకోసం, ఖర్చు తగ్గేవిధంగా సోలార్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకోసం ఇస్తున్న సంక్షేమ పధకాలను సద్వినియోగం చేసుకోవాలని గంటా నూకరాజు విజ్ఞప్తి చేసారు.
ఈ కార్యక్రమంలో 3వ వార్డు కార్పొరేటర్ గంటా అప్పలకొండ, హోసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ రమణ, సి ఎల్ టి సి కె.శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు కాసరపు నాగరాజు, మారోజు సంజీవ్ కుమార్, వాడమొదలు సత్యారావు, కొక్కిరి అప్పన్న, జలగడుగుల మురళి, పైడిపల్లి నర్సింగరావు, పుక్కళ్ళ లక్ష్మీ కుమారి, అప్పికొండ నూకరాజు, సంకురుభుక్త జోగారావు, బొడ్డు రమేష్, రాజగిరి రమణ, నొల్లి చిన్న రమణ, నెక్కెళ్ళ వెంకటరావు, వియ్యపు పోతురాజు, వాసుపల్లి వంశీ, వియ్యపు నాయుడు, శ్రీనివాసరావు మాస్టర్, మట్టా కొండ, పీరుపిల్లి రాజు, అల్లిపిల్లి గురువులు, కర్రి శివ, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం. రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.