Thursday, 26 March 2026
  • Home  
  • ప్రతి నియోజకవర్గానికి ఒక ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలి*
- విశాఖపట్నం

ప్రతి నియోజకవర్గానికి ఒక ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలి*

*ప్రతి నియోజకవర్గానికి ఒక ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలి* *మద్యం దుకాణాల్లో సురక్ష యాప్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరగాలి* *జిల్లా ఇంచార్జి మంత్రి కొల్లు రవీంద్ర* అనకాపల్లి, అక్టోబర్ 22: సామాన్య ప్రజలకు జిల్లాలో ఇసుక కొరత లేకుండా ఉండేందుకు ప్రతి నియోజకవర్గానికి ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర భూగర్భ గనుల మరియు ఎక్సైజ్ శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి పేర్కొన్నారు. బుధవారం కలక్టరేట్ సమావేశ మందిరంలో గనులు మరియు భూగర్భ, ఎక్సైజ్ శాఖల పురోగతి పై రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, మాడుగుల, పెందుర్తి, చోడవరం శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేష్ బాబు, కె సూర్యనారాయణ రాజు తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంచార్జి మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఇసుక కొరత లేకుండ చూడాలన్నారు. అవసరానికి మించి ఇసుక అవసరం అయితే మరికొన్ని స్టాక్ పాయింట్లు ఏర్పాటు చెయ్యాలని జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి ఎం శ్రీనివాస్ కి ఆదేశించారు. 1 నుండి 3 వరకు గల ఇసుక రీచ్ లలో ఎడ్ల బండి మరియు ట్రాక్టర్ ల సహాయం తో వాళ్ల సొంత అవసరలకు ఇసుకను తరలించుకోవ చ్చని తెలిపారు. దానికి అనుగునంగా జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి పై నా తెలిపినటువంటి ఇసుక రీఛాలు 44 ఉన్నాయని ఇంచార్జి మంత్రి కి తెలియజేసారు. ఎక్సయిజ్ శాఖ పై ఇంచార్జి మంత్రి మాట్లాడుతూ ఎ పి ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మాత్రమే మద్యం దుకాణాల్లో అమ్మకాలు జరిగేలా చూడాలని మరియు జిల్లాలో ఇప్పటికే నిర్మూలించిన బెల్ట్ షాపులను పునరావృత్తం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎక్సైజ్ అధికారి వి. సుధీర్ కు ఆదేశించారు. వినియోగదారుడు తన యాండ్రైడ్ మొబైల్ లో ఎ.పి ఎక్సైజ్ సురక్ష యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని మద్యం కొనుగోలు చేసుకునే ముందు మద్యం సీసా పై క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసుకొని మద్యం సీసా అసలుదో, నకిలీదో నిర్దారించుకొని మద్యాన్ని కొనుగోలు చేసుకోవాలని మద్యం ప్రియులకు మంత్రి పిలుపునిచ్చారు. పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ జిల్లాలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు మరియు తరలింపును అర్ధరాత్రి పూట జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు, ఇంచార్జి మంత్రి స్పందిస్తూ ఈ గ్రావెల్ మాఫియాను అరికట్టాలాసంటే ఒక్క గనుల మరియు భూగర్భ శాఖ సరిపోదు గనుక రెవెన్యూ మరియు పోలీస్ శాఖ లను సమన్వయ పరిచి. ఈ సమస్య కు పరిష్కరింస్తామని తెలియజేశార. సమావేశం అనంతరం మీడియా సమావేశంలో ఇంచార్జి మంత్రి మాట్లాడారు ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి, డి అర్యో వై సత్యనారాయణ రావు, అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీఓ లు షేక్ అయిషా, వి వి రమణ, జిల్లా ఎక్సయిజ్ అధికారి వి సుదీర్, జిల్లా భూగర్భ గనులు శాఖ అధికారి ఎం శ్రీనివాస్, నీటి పారుదల శాఖ డి ఈ ఈ త్రినాధ్. వివిధ రాష్ట్ర కార్పొరేషన్ ల చైర్మెన్లు పీలా గోవిందా సత్యన్నారాయణ, మళ్ళా సురేంద్ర బాబు, బత్తుల తాతయ్య బాబు, కె విజయ్ కుమార్, డి సి ఎం ఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*ప్రతి నియోజకవర్గానికి ఒక ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలి*

*మద్యం దుకాణాల్లో సురక్ష యాప్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరగాలి*
*జిల్లా ఇంచార్జి మంత్రి కొల్లు రవీంద్ర*

అనకాపల్లి, అక్టోబర్ 22: సామాన్య ప్రజలకు జిల్లాలో ఇసుక కొరత లేకుండా ఉండేందుకు ప్రతి నియోజకవర్గానికి ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర భూగర్భ గనుల మరియు ఎక్సైజ్ శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి పేర్కొన్నారు. బుధవారం కలక్టరేట్ సమావేశ మందిరంలో గనులు మరియు భూగర్భ, ఎక్సైజ్ శాఖల పురోగతి పై రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, మాడుగుల, పెందుర్తి, చోడవరం శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేష్ బాబు, కె సూర్యనారాయణ రాజు తో కలిసి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా ఇంచార్జి మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఇసుక కొరత లేకుండ చూడాలన్నారు. అవసరానికి మించి ఇసుక అవసరం అయితే మరికొన్ని స్టాక్ పాయింట్లు ఏర్పాటు చెయ్యాలని జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి ఎం శ్రీనివాస్ కి ఆదేశించారు. 1 నుండి 3 వరకు గల ఇసుక రీచ్ లలో ఎడ్ల బండి మరియు ట్రాక్టర్ ల సహాయం తో వాళ్ల సొంత అవసరలకు ఇసుకను తరలించుకోవ చ్చని తెలిపారు. దానికి అనుగునంగా జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి పై నా తెలిపినటువంటి ఇసుక రీఛాలు 44 ఉన్నాయని ఇంచార్జి మంత్రి కి తెలియజేసారు. ఎక్సయిజ్ శాఖ పై ఇంచార్జి మంత్రి మాట్లాడుతూ ఎ పి ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మాత్రమే మద్యం దుకాణాల్లో అమ్మకాలు జరిగేలా చూడాలని మరియు జిల్లాలో ఇప్పటికే నిర్మూలించిన బెల్ట్ షాపులను పునరావృత్తం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎక్సైజ్ అధికారి వి. సుధీర్ కు ఆదేశించారు. వినియోగదారుడు తన యాండ్రైడ్ మొబైల్ లో ఎ.పి ఎక్సైజ్ సురక్ష యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని మద్యం కొనుగోలు చేసుకునే ముందు మద్యం సీసా పై క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసుకొని మద్యం సీసా అసలుదో, నకిలీదో నిర్దారించుకొని మద్యాన్ని కొనుగోలు చేసుకోవాలని మద్యం ప్రియులకు మంత్రి పిలుపునిచ్చారు.

పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ జిల్లాలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు మరియు తరలింపును అర్ధరాత్రి పూట జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు, ఇంచార్జి మంత్రి స్పందిస్తూ ఈ గ్రావెల్ మాఫియాను అరికట్టాలాసంటే ఒక్క గనుల మరియు భూగర్భ శాఖ సరిపోదు గనుక రెవెన్యూ మరియు పోలీస్ శాఖ లను సమన్వయ పరిచి. ఈ సమస్య కు పరిష్కరింస్తామని తెలియజేశార. సమావేశం అనంతరం మీడియా సమావేశంలో ఇంచార్జి మంత్రి మాట్లాడారు

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి, డి అర్యో వై సత్యనారాయణ రావు, అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీఓ లు షేక్ అయిషా, వి వి రమణ, జిల్లా ఎక్సయిజ్ అధికారి వి సుదీర్, జిల్లా భూగర్భ గనులు శాఖ అధికారి ఎం శ్రీనివాస్, నీటి పారుదల శాఖ డి ఈ ఈ త్రినాధ్. వివిధ రాష్ట్ర కార్పొరేషన్ ల చైర్మెన్లు పీలా గోవిందా సత్యన్నారాయణ, మళ్ళా సురేంద్ర బాబు, బత్తుల తాతయ్య బాబు, కె విజయ్ కుమార్, డి సి ఎం ఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.