తేది:03-06-2020
పొదలకూరు: పొదలకూరుమండలం ఇనుకుర్తి, ముదిగేడు గ్రామాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
గర్భవతులకు, బాలింతలకు మేలురకం బియ్యం (సార్ టెక్స్) పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.
స్క్రోలింగ్ పాయింట్స్:
? సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతున్నాయి.
? నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, నిరంతరం పర్యవేక్షిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడానికి కృషి చేస్తున్నాం.
? ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు ఊహించిన దాని కన్నా మిన్నగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.
? మహోన్నతమైన పాలనను అందించిన స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి పాలనను కూడా మైమరిపించే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పాలనను కొనసాగిస్తున్నారు.
? ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కోర్టులకు వెళ్లి అడ్డంకులు సృష్టిస్తున్నా అభివృద్ధి కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.
? గ్రామాలకు అవసరమైన తాగునీరు, సాగునీరు, రోడ్లు, సైడు కాలువలు, స్కూళ్లు, స్మశానవాటికల అభివృద్ధి, పొలాలకు వెళ్లే దారులు లాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు వీధిలైట్లు, విద్యుత్ సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం.
? ఇళ్ల స్థలాలు లేని కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు శాశ్వత ఇళ్లు నిర్మించి ఇస్తాం.
? నీరు- చెట్టు లాంటి దోపిడి కార్యక్రమాలు కాకుండా ప్రజలకు అవసరమైన శాశ్వత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తాం.
? గతంలో పెత్తనం వెలగబెట్టిన కొంతమంది, అధికారులను బెదిరించి బ్లాక్ మెయిల్ చేయాలనే ఆలోచన మానుకుంటే మంచిది.
? ఎవడో పనికిమాలిన వాడి తాటాకు చప్పుళ్ళకో, ఉడతా బెదిరింపులకు సర్వేపల్లి నియోజకవర్గంలో అధికారులు ఎవ్వరూ భయపడరు.
? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తప్పు చేస్తే ఎంతటి వాడినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
? గతంలో అనుసరించిన విధానాలకు స్వస్తి పలికి, అనవసరంగా నోరు పారేసుకోకుండా విమర్శలు చేసి నవ్వులపాలు కాకుండా ఉంటే మంచిది.
? కండలేరు జలాశయం నుండి పొదలకూరు, మనుబోలు మండల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరాల మేరకు నీటిని విడుదల చేస్తాం.
? గత ప్రభుత్వంలో మాదిరి నీటి విడుదలలో రాజకీయ జోక్యం లేకుండా ప్రజా అవసరాల మేరకు నీటిని విడుదల చేస్తాం.
? సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది, “ఆదర్శ నియోజకవర్గం”గా నిలపడమే నా లక్ష్యం.