ప్రజా సమస్యలపై చురుకైన పోరాటం.. MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని జగన్ అభినందన కౌన్సిల్ సమావేశాలు ముగిసిన అనంతరం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.
కౌన్సిల్‌లో టీటీడీ కల్తీ నెయ్యి ఘటనతో పాటు పలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రజావ్యతిరేక అంశాలపై చురుకుగా స్పందిస్తున్నందుకు జగన్ మోహన్ రెడ్డి ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలపై కూడా ఇరువురు చర్చించారు.



