*శాసన సభ్యులు వనమాడి కొండబాబు*
కాకినాడ జిల్లా కాకినాడ సిటీ :కాకినాడ నగర ప్రజలుఎదుర్కొంటున్న సమస్యలకు వేగవంతమైన పరిష్కారాలు అందించాలనే లక్ష్యంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 32, 33,34,35 డివిజన్లకు సభందించి పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగాణంలో మధ్యాహ్నం 27,28,29,30,31, డివిజన్లకు సంబంధించి అన్నదాన సమాజంలోనూ ప్రజాధర్భర్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పాల్గొని ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని, సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటికి పరిష్కారం మార్గాలు చేపట్టడమే కొరకు ప్రజాదర్బార్ నిర్వహించడం జరుగుతుందని, నగర అభివృద్ధి, మౌలిక వసతులు, త్రాగునీరు, పారిశుధ్యం, రహదారులు తదితర అంశాలపై ఫిర్యాదులు తగ్గు ముఖం పట్టాయని అన్నారు. ప్రస్తుతం వ్యక్తిగత పెన్షన్, ఇళ్ల స్థలాల కోసం పిర్యాదులు అధికంగా వస్తున్నాయని వాటిని పరిశీలించి, సమస్యల పరిష్కారానికి సమయపాలనతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అక్కడికక్కడే నమోదు చేసి, త్వరితగతిన పరిష్కరించే విధంగా సంబంధిత శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువయ్యేలా చేస్తాయని, ప్రజా సమస్యలపై నేరుగా స్పందించడానికి ఇవి దోహదపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమం కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృద్వి చరణ్, టిపిఆర్ఓ శైలజ, డిసిపి కృష్ణారావు, డి కనకారావు, స్థానిక కూటమి శ్రేణులు మల్లిపూడి వీరు, గదుల సాయిబాబా, SK రహీం బాబు, గుజ్జు దుర్గ లక్ష్మణరావు, బంగారు సూర్యావతీ సత్యనారాయణ, చింతలపూడి రవి, రిక్క లక్ష్మి, పొంగ బుజ్జి, పసుపులేటి వెంకటేశ్వరరావు, గోపిశెట్టి బూరయ్య, కోడూరి పెద్ద, రెడ్డనం సత్తిబాబు, నేమాని సత్యనారాయణ, చిట్టిబాబు, మనోహర్ గుప్తా, అమలకంటి బలరాం, పొంగా సత్య, గబ్బర్ సింగ్, బాక్సర్, తోట రెడ్డి, కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


