
బుధవారం (24-09-2025) పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నముషిడివాడ రాజ్యలక్ష్మి కళ్యాణమండపంలో, పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.వి. సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బార్ యజమానులు, వైన్ షాప్ నిర్వాహకులతో అవగాహన సమావేశం జరిగింది.
ప్రజల భద్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ – 2013 ప్రకారం ప్రతి బార్, వైన్ షాప్‌లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి సక్రమంగా నిర్వహించాల్సిందిగా స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
ముఖ్య మార్గదర్శకాలు:
ప్రవేశద్వారం, కౌంటర్, హాల్స్, బయట ప్రాంగణంలో సీసీటీవీలు తప్పనిసరి.
రికార్డింగ్స్‌ను కనీసం 30 రోజులు భద్రపరచాలి.
పోలీస్ శాఖ కోరినపుడు రికార్డింగ్స్ తక్షణం అందించాలి.
కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో నిరంతరం పర్యవేక్షించాలి.
“ప్రజల సురక్ష, శాంతి, క్రమశిక్షణ కోసం బార్, వైన్ షాప్ నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించాలి. వ్యాపార బాధ్యతతో పాటు సామాజిక బాధ్యతను కూడా నిబద్ధతతో నిర్వర్తించాలి. ప్రజా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం మనందరి కర్తవ్యం” అని ఇన్స్పెక్టర్ శ్రీ కె.వి. సతీష్ కుమార్ తెలిపారు.

