తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఓర్పుతో ఆలకించారు. వచ్చిన ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో వెంటనే చర్చించారు. సమస్యల తీవ్రతను బట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని, ఆలస్యం లేకుండా న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజల కష్టాలను తమవిగా భావిస్తూ ప్రతి వినతికి పరిష్కారం చూపేందుకు కృషి చేయడం ద్వారా ఆయనపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగింది.



