సుద్దాల లింగం సర్పంచ్‌గా భారీ గెలుపు..
జాజాల సురేందర్ సన్మానం సందడి!
కామారెడ్డి 12 డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో 11.12.2025న సర్పంచ్ ఎన్నికలు జరిగి, టీఆర్ఎస్ అభ్యర్థి సుద్దాల లింగం భారీ మెజారిటీతో గెలిచారు. గ్రామ ప్రజలు జోష్‌లో మునిగి ఉన్నారు. విజయోత్సవంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సర్పంచ్ లింగం , వార్డు మెంబర్లను సన్మానం చేశారు. స్థానికుల సంతోషం: “లింగం గెలిచారు, ఇక గ్రామం గెలిచింది” అంటూ అందరూ చెప్పుకుంటు న్నారు. రోడ్లు, నీరు, విద్యుత్ సమస్యలకు త్వరిత చర్యలు, రైతులకు సహకారం..ఇవన్నీ ప్రాధాన్యత అని సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈ సన్మాన కార్యక్ర మంలో మాజీ ఎంపీపీ ఎన్ దశరథ్ రెడ్డి, కాలభైరవ స్వామి, మాజీ చైర్మన్ గంజి సతీష్ గుప్తా, కిరణ్ కుమార్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు టంకరి రవి తదితరులు పాల్గొన్నారు.


