పువ్వాడ నాగేంద్ర కుమార్, (పున్నమి తెలంగాణ ప్రతినిధి)
దట్టమైన పొగమంచు కారణంగా రోడ్లపై ప్రయాణం ప్రమాదకరమని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరిక జారీ చేశారు. ఇటీవల చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని స్వల్ప నిర్లక్ష్యమే పెద్ద ప్రాణ నష్టాలకు దారితీసే అవకాశముందని ఆయన తెలిపారు.
పొగమంచు కారణంగా దూరం కనిపించకపోవడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులు స్పష్టంగా గమనించలేని పరిస్థితులు ఏర్పడుతాయని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించారు.
వాహనదారులకు సీపీ సునీల్ దత్ పలు సూచనలు చేశారు.
వాహనాలను వేగంగా నడపకండి
ప్రయాణానికి ముందు వాహన పరిస్థితిని తనిఖీ చేయండి
డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దు
అనవసరంగా ఓవర్‌టేక్ చేయకండి
ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించండి
పౌరుల ప్రాణ భద్రత కోసం ఈ సూచనలు తప్పనిసరిగా పాటించాలని CP సునీల్ దత్ విజ్ఞప్తి చేశారు.


