జిఎస్టీ 2.ఓ ను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో సూపర్ జిఎస్టీ ` సూపర్ సేవింగ్స్ నినాదంతో ముద్రించిన కరపత్రాలను స్థానిక 25వ డివిజన్‌లోని వ్యాపారులు, ప్రజలకు అందించడం జరిగింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు, గన్ని కృష్ణ గారు, యర్రా వేణు గోపాల రాయుడు గారు, కాశీ నవీన్ కుమార్ గారు, దొండపాటి సత్యంబాబు గారు, అత్తి సత్యనారాయణ గారు, మజ్జి రాంబాబు గారు, బుడ్డిగ రాధా గారు, వర్రే శ్రీనివాసరావు గారు, వై శ్రీను గారు, రెడ్డి మణేశ్వరరావు గారు, కురగంటి సతీష్ గారు, అడబాల రామకృష్ణ గారు తదితర నాయకులు సదరు డివిజన్‌లోని షాపులు, ప్రజల వద్దకు వెళ్లి సూపర్ జిఎస్టీ ` సూపర్ సేవింగ్స్ కర పత్రాలను అందచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ జీఎస్టీ 2.0 కింద అనేకమైన స్లాబ్స్ ఏదైతే ఉన్నాయో మధ్యతరగతి, దిగు మధ్యతరగతి వారికి చాలా ఉపయుక్తంగా ఉన్నాయన్నారు.
కిరాణా సామాగ్రి ఏదైతే గతంలో ఉన్న శ్లాబ్‌ను తగ్గించడం జరిగిందని, కొన్నింటిపై జిఎస్టీ తీసివేయడం జరిగిందన్నారు. అలాగే ఇళ్లల్లో పిల్లలు వాడే ఎరేజర్స్ గాని పెన్సిల్స్ కానీ టాక్సే లేదన్నారు. జిఎస్టీ 2.0 ద్వారా ప్రతి కుటుంబానికి కూడా నెలసరి రూ. 15,000 ఆదా కానుందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మల సీతారామన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రజానీకం అందరు కూడా హర్షిస్తా ఉన్నారని అన్నారు.
వాహన మిత్ర ద్వారా ప్రతి ఆటో డ్రైవర్ కి రూ. 15000 అందనున్నాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం ప్రగతి పధంలో నడుస్తుందన్నారు, అందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు.
డివిజన్ ఇన్‌ఛార్జ్ తవ్వా రాజా పర్యవేక్షణలో, డివిజన్ ప్రెసిడెంట్ ముద్రగడ జయరామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నందు, అర్లపల్లి బబ్లు, శెట్టి జగదీష్, కడలి రామకృష్ణ, మొకమాటి సత్యనారాయణ, బుడ్డిగ రవి, దాస్యం ప్రసాద్, అక్కిరెడ్డి ప్రసాద్, దుర్గ, చాపల చిన్నరాజు, గౌతమి, కురగంటి త్రినాధ్,అమీర్ రాజా, గుత్తుల సత్యనారాయణ, ఆడారి లక్ష్మీ నారాయణ, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


