పున్నమి న్యూస్, పెద్దాపురం 26/10,
కాకినాడ జిల్లా, S.P. శ్రీ బిందు మాధవ్ వారి ఆదేశాల మేరకు డిఎస్పి . శ్రీ.D.శ్రీహరి రాజు పర్యవేక్షణలో కార్డాన్ అండ్ సెర్చ్ లో భాగంగా పెద్దాపురం వాలుతిమ్మాపురం రోడ్డు మార్గంలో ఉన్న టిడ్కో గృహాలలో ఐదు బృందాలుగా పోలీసులు అధికారులు విస్తృత తనిఖీలు ఆదివారం తెల్లవారిజమున 4.గంటల నుండి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం సిఐ విజయ శంకర్ ,సామర్లకోట క్రైమ్ సి.ఐ అంకమరావు,పెద్దాపురం ఎస్ఐ మౌనిక,జగ్గంపేట ఎస్సై రఘురాం, గండేపల్లి ఎస్సై నాగబాబు, 50 మంది పోలీస్ సిబ్బంది 5 బృందాలు గా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు.24 ద్విచక్ర వాహనాలను ,1 ఆటో ను రికార్డులు లేవని గుర్తించారు. పోలీస్ వారు డ్రోన్ కెమెరాలతో తనిఖీలు నిర్వహించి, టిడ్కో గృహాలలో నివసిస్తున్న ప్రజలకు పెద్దాపురం సిఐ విజయ శంకర్ కొన్ని సూచనలను ఇస్తూ ,అసాంఘిక కార్యక్రమాల కు ఎవరైనా పాల్పడితే తక్షణమే సమాచారం అందించేలా పోలీస్ అధికారుల మొబైల్ నెంబర్లను ఇచ్చారు. అలాగే బయట వ్యక్తులు ఎవరైనా ఆశ్రయం కోసం వచ్చిన తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలన్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారికి
అవగాహన కల్పించారు.

పెద్దాపురం టిడ్కో గృహల నందు కార్దన్ అండ్ సెర్చ్
పున్నమి న్యూస్, పెద్దాపురం 26/10, కాకినాడ జిల్లా, S.P. శ్రీ బిందు మాధవ్ వారి ఆదేశాల మేరకు డిఎస్పి . శ్రీ.D.శ్రీహరి రాజు పర్యవేక్షణలో కార్డాన్ అండ్ సెర్చ్ లో భాగంగా పెద్దాపురం వాలుతిమ్మాపురం రోడ్డు మార్గంలో ఉన్న టిడ్కో గృహాలలో ఐదు బృందాలుగా పోలీసులు అధికారులు విస్తృత తనిఖీలు ఆదివారం తెల్లవారిజమున 4.గంటల నుండి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం సిఐ విజయ శంకర్ ,సామర్లకోట క్రైమ్ సి.ఐ అంకమరావు,పెద్దాపురం ఎస్ఐ మౌనిక,జగ్గంపేట ఎస్సై రఘురాం, గండేపల్లి ఎస్సై నాగబాబు, 50 మంది పోలీస్ సిబ్బంది 5 బృందాలు గా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు.24 ద్విచక్ర వాహనాలను ,1 ఆటో ను రికార్డులు లేవని గుర్తించారు. పోలీస్ వారు డ్రోన్ కెమెరాలతో తనిఖీలు నిర్వహించి, టిడ్కో గృహాలలో నివసిస్తున్న ప్రజలకు పెద్దాపురం సిఐ విజయ శంకర్ కొన్ని సూచనలను ఇస్తూ ,అసాంఘిక కార్యక్రమాల కు ఎవరైనా పాల్పడితే తక్షణమే సమాచారం అందించేలా పోలీస్ అధికారుల మొబైల్ నెంబర్లను ఇచ్చారు. అలాగే బయట వ్యక్తులు ఎవరైనా ఆశ్రయం కోసం వచ్చిన తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలన్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారికి అవగాహన కల్పించారు.

