తొట్టంబేడు, మార్చి 25 (పున్నమి న్యూస్): తొట్టంబేడు మండలంలోని పెద్ద సింగమల గ్రామంలో వెలసిన శ్రీ సీతారామ లక్ష్మణ హనుమంత సమేత శ్రీ రామచంద్ర స్వామి వారి ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ వేడుకలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగడం శుభసూచకమని కొనియాడారు. కుంభాభిషేక మహోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్న గ్రామస్తులకు, భక్తులకు ఆయన తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని పునీతులయ్యారు.

పెద్ద సింగమలలో రామచంద్రుని సేవలో ఎమ్మెల్యే బొజ్జల