Thursday, 5 February 2026
  • Home  
  • పెంచలకోనలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పెంచలకోనలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

రాపూరు మండలంలోని ప్రసిద్ధ పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో సోమవారం దసరా నవరాత్రి ఉత్సవాలు భక్తుల ఉత్సాహం మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారు సౌభాగ్యలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కరుణ కటాక్షాలు కురిపించారు. దసరా నవరాత్రుల సందర్భంగా చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వచ్చి అమ్మవారి దివ్యదర్శనం పొందారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రసాదాలను స్వీకరించారు. దేవస్థాన అధికారులు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయగా, భక్తులంతా ఆనందభరితమైన వాతావరణంలో ఉత్సవాల్లో పాల్గొన్నారు. దసరా ఉత్సవాలు వచ్చే రోజుల్లో కూడా వైభవంగా కొనసాగనున్నాయని ఆలయ అధికారులు తెలిపారు.

రాపూరు మండలంలోని ప్రసిద్ధ పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో సోమవారం దసరా నవరాత్రి ఉత్సవాలు భక్తుల ఉత్సాహం మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారు సౌభాగ్యలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కరుణ కటాక్షాలు కురిపించారు.
దసరా నవరాత్రుల సందర్భంగా చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వచ్చి అమ్మవారి దివ్యదర్శనం పొందారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రసాదాలను స్వీకరించారు.
దేవస్థాన అధికారులు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయగా, భక్తులంతా ఆనందభరితమైన వాతావరణంలో ఉత్సవాల్లో పాల్గొన్నారు.
దసరా ఉత్సవాలు వచ్చే రోజుల్లో కూడా వైభవంగా కొనసాగనున్నాయని ఆలయ అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.