*
*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ముత్యాల పాలెం గ్రామంలో మోంధా తుఫాను పునరావాస కేంద్రాలను సందర్శించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు*
పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెం గ్రామంలో మోంధా తుఫాన్ పునరావస కేంద్రాన్ని సందర్శించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు.
తుఫాన్ పునరావాస కేంద్రాంలో మత్స్యకారులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉపముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నిత్యం తుఫాన్ పరిస్థితులు మినిట్ టూ మినిట్ మౌనరటింగ్ చేస్తూ అవసరమైన సలహాలు సూచనలు అందిస్తున్నారు. తుఫాన్ పునరావాస కేంద్రాలకు విచ్చేసిన ప్రజలకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం రాత్రి భోజనం వసతి ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎవరైతే ఇల్లు కోల్పోయిన వారు ఉంటే వాళ్ళు కూడా తుఫాను తగ్గిన అనంతరం ఇంటింటికి వెళ్లి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం తరువాత తుఫాను తీవ్రత పెరిగే అవకాశం ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసిన సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రజల కోసం సూచన చేశారు. తుఫాను కారణంగా ముత్యాలమ్మ పాలెం సముద్రతీరాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా ఈ తుఫాను తీవ్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుందని, అదేవిధంగా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి, ఎక్కడ ఆస్తి మరియు ప్రాణనష్టం జరగకుండా చూడడానికి కావలసిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటించి అత్యవసరము అయితే తప్ప దయచేసి బయటకు రాకుండా ఉండాలన్నారు. మధ్యాహ్నం తర్వాత తుఫాను తీవ్రత పెరిగే అవకాశం ఉండడం వలన చెట్లు పడిపోవడం, పిడుగులు పడడం వంటివి జరుగుతాయి కాబట్టి ప్రజలను బయటకు రావద్దన్నారు. తుఫాను బిల్డింగుల్లో తలదాచుకుంటున్న వారందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని, భోజన వసతి, అనారోగ్యం పాలవకుండా డాక్టర్లను, కరెంటు సమస్య రాకుండా విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేసామన్నారు. పాత గోడలు, కరెంటు స్తంభాల సమీపంలోనూ ఉండవద్దని సూచించారు. అన్ని శాఖల అధికారులు చాలా అప్రమత్తంగా పనిచేస్తున్నారని, ముఖ్యంగా పోలీస్ మరియు విద్యుత్ శాఖ అధికారులు రెవిన్యూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని, అన్ని శాఖల అధికారులు ఫోన్ నెంబర్లు పనిచేస్తాయని, ఎక్కడ ఏ ఇబ్బంది కలిగిన వెంటనే వారికి సమాచారం తెలియజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పరవాడ మండల ఎంపీడీవో రమేష్ నాయుడు గారు, మండల రెవెన్యూ అధికారి నాగరాజు గారు,ఉమ్మడి విశాఖ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు ముత్యాలమ్మ పాలెం సర్పంచ్ రాష్ట్ర మత్స్యకార సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీమతి శ్రీ చింతకాయల సుజాత ముత్యాలు గారు, పంచకర్ల ప్రసాద్ రావు గారు,మాజీ జెడ్పిటిసి సభ్యులు పైల జగన్నాధరావు గారు, మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు గారు, పరవాడ మండలం పార్టీ అధ్యక్షులు బోద్దపు శ్రీనివాసులు, వియ్యపు చిన్న గారు, ఉపాధ్యక్షు వెన్నెల నరసింహారావు గారు, సర్పంచులు మోటూరు సన్యాసినాయుడు గారు, కన్నూరి వెంకటరమణ గారు, కొండ్రపు శ్రీరామమూర్తి గారు,జిల్లా కార్యవర్గ సభ్యులు బుగుడి రామ గోవిందరావు గారు,మాజీ కార్పొరేటర్ డల్లా రామనాయుడు గారు, కేఎన్ఆర్ గారు, రాపర్తి కిషోర్ గారు, మోసా రామకృష్ణ గారు,బంటు సురేష్ గారు, సన్ని బాబు గారు,అనిల్ గారు, నాగిరెడ్డి చెన్నారావు గారు, పావని గారు, మొదలగు పరవాడ మండలం ఉమ్మడి ఎన్డీఏ మహాకోటమే నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


