పిల్లల ఆహారం… ఆమెకు ఫలహారం
పొదలకూరు ఆగష్టు పున్నమి ప్రతినిధి: అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందాల్సిన పౌష్టిక ఆహారం అంగన్ వాడి టీచర్ కు ఫలహారంగా మారిన సంఘటన పొదలకూరు పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి… వెంకటేశ్వర నగర్ కాలనీలో అంగనవాడి కార్యకర్తగా పనిచేస్తున్న సునీత చిన్నారులు గర్భవతులు బాలింతలకు ప్రభుత్వం ఉచితంగా అందజేసే పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టిస్తోంది. అంగన్వాడి కేంద్రంలోని కోడిగుడ్లు పాలు బాలామృతం చిక్కీలు రాగి పిండి తదితర పౌష్టికాహారాన్ని మొత్తం ఆటోలో బజారుకి తరలిస్తుండగా గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు ఐసిడిఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐసిడిఎస్ సిడిపిఓ విజయలక్ష్మి అంగన్వాడీ కేంద్రానికి చేరుకుని రిజిస్టర్లు నిల్వలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో గర్భవతులు, బాలింతలను విచారించారు. అక్కడ పనిచేసే అంగన్వాడీ కార్యకర్త సునీత తమకు గత కొంతకాలంగా సరుకులు ఇవ్వడం లేదని అడిగితే ప్రభుత్వం ప్రభుత్వం నుంచి రాలేదని తమను బెదిరిస్తోందన్నారు. అంగన్వాడి కేంద్రాలపై ఐసిడిఎస్ సూపర్వైజర్ సిడిపిఓ లా పర్యవేక్షణ లేకపోవడంతో కార్యకర్తల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని బిజెపి టిడిపి టిడిపి నాయకులు ఆరోపించారు. చిన్నారుల పౌష్టికాహారాన్ని తస్కరించిన అంగన్వాడి కార్యకర్తపై గట్టి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిడిపిఓ విజయలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్త సునీత దాటవేస్తూ పట్టుబడిన సరుకులను పరిశీలించ్చానని, నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి కఠిన చర్యలు తీసుకొంటామని చెప్పారు.

