మోటిమలు (పింపుల్స్) ఏర్పడటానికి ప్రధాన కారణాల్లో ఒకటి శరీరంలో ఇన్సూలిన్ స్థాయి పెరగడం అని వైద్యులు చెబుతున్నారు. కూల్‌డ్రింక్స్, బిస్కెట్లు, వైట్ బ్రెడ్, నూడుల్స్ వంటి అధిక ప్రాసెస్ చేసిన ఆహారాలు ఇన్సూలిన్‌ను పెంచుతాయి. దీంతో ఆండ్రోజెన్ హార్మోన్ ఉత్పత్తి అధికమై, చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఫలితంగా బ్యాక్టీరియా పెరిగి మొటిమలు వస్తాయి.
అదనంగా, హార్మోన్ అసమతుల్యత కూడా పింపుల్స్‌కు ప్రధాన కారణంగా ఉంటుంది.
చర్మ ఆరోగ్యాన్ని కాపాడేందుకు వాల్‌నట్స్, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, చేపలు, పాలకూర, క్యారెట్ వంటి పోషకాహారం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


