Saturday, 14 March 2026
  • Home  
  • పవన్ కళ్యాణ్ పై బెదిరింపులు చేస్తే ఊరుకోము:
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పవన్ కళ్యాణ్ పై బెదిరింపులు చేస్తే ఊరుకోము:

పవన్ కళ్యాణ్ పై బెదిరింపులు చేస్తే ఊరుకోము: జనసేన నేత కాకు మురళి రెడ్డి నెల్లూరు: అన్నీ మతాలను గౌరవించే వ్యక్తి పవన్క ళ్యాణ్అ ని, అలాంటి నాయకుడిపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు సహించరని జనసేన నాయకుడు కాకు మురళి రెడ్డి హెచ్చరించారు. ఒక క్రైస్తవ పాస్టర్ పవన్ కళ్యాణ్‌ను నరుకుతామని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకు మురళి రెడ్డి, గునుకుల కిషోర్, నూనె మల్లిఖార్జున్ మాట్లాడుతూ సనాతన ధర్మం పై దాడులు జరుగుతున్నాయని, తిరుమల లడ్డూ అంశంపై పవన్ కళ్యాణ్ బలంగా స్పందించినందుకు ఆయనకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి కొందరు రాజకీయంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అంబటి రాంబాబు ద్వారా కాపులను, బీసీ పార్టీ నేత రామచంద్ర యాదవ్ ద్వారా బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం జరిగిందని, అవి ఫలించకపోవడంతో ఇప్పుడు మత రాజకీయాలను ప్రోత్సహించేలా క్రైస్తవ పాస్టర్‌ను ముందుకు తెచ్చారని విమర్శించారు. డానీయల్ కెనడి అనే పాస్టర్ పవన్ కళ్యాణ్‌ను నరుకుతామని చేసిన వ్యాఖ్యల వెనుక వైస్సార్కాం గ్రెస్ పార్టీ కుట్ర ఉందని వారు ఆరోపించారు. కులాలను కలిపే ఆలోచన, మత ప్రస్తావనలేని రాజకీయ సిద్ధాంతాలను పాటించే పార్టీ జనసేన అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పని చేస్తున్న పవన్ కళ్యాణ్ జోలికి, సర్వమతాలను గౌరవించే సనాతన ధర్మం జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఏటూరి రవికుమార్, ఆఫీస్ ఇంచార్జి జమీర్, మహేష్ శర్మ, హరికృష్ణ, విజయ్, వీరమహిళలు వాణి తదితరులు పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ పై బెదిరింపులు చేస్తే ఊరుకోము:
జనసేన నేత కాకు మురళి రెడ్డి
నెల్లూరు:
అన్నీ మతాలను గౌరవించే వ్యక్తి పవన్క ళ్యాణ్అ ని, అలాంటి నాయకుడిపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు సహించరని జనసేన నాయకుడు కాకు మురళి రెడ్డి హెచ్చరించారు. ఒక క్రైస్తవ పాస్టర్ పవన్ కళ్యాణ్‌ను నరుకుతామని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాకు మురళి రెడ్డి, గునుకుల కిషోర్, నూనె మల్లిఖార్జున్ మాట్లాడుతూ సనాతన ధర్మం పై దాడులు జరుగుతున్నాయని, తిరుమల లడ్డూ అంశంపై పవన్ కళ్యాణ్ బలంగా స్పందించినందుకు ఆయనకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి కొందరు రాజకీయంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
అంబటి రాంబాబు ద్వారా కాపులను, బీసీ పార్టీ నేత రామచంద్ర యాదవ్ ద్వారా బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం జరిగిందని, అవి ఫలించకపోవడంతో ఇప్పుడు మత రాజకీయాలను ప్రోత్సహించేలా క్రైస్తవ పాస్టర్‌ను ముందుకు తెచ్చారని విమర్శించారు.
డానీయల్ కెనడి అనే పాస్టర్ పవన్ కళ్యాణ్‌ను నరుకుతామని చేసిన వ్యాఖ్యల వెనుక వైస్సార్కాం గ్రెస్ పార్టీ కుట్ర ఉందని వారు ఆరోపించారు. కులాలను కలిపే ఆలోచన, మత ప్రస్తావనలేని రాజకీయ సిద్ధాంతాలను పాటించే పార్టీ జనసేన అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పని చేస్తున్న పవన్ కళ్యాణ్ జోలికి, సర్వమతాలను గౌరవించే సనాతన ధర్మం జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఏటూరి రవికుమార్, ఆఫీస్ ఇంచార్జి జమీర్, మహేష్ శర్మ, హరికృష్ణ, విజయ్, వీరమహిళలు వాణి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.