Tuesday, 24 March 2026
  • Home  
  • పల్లెకు సదుపాయం… ప్రతి ఇంటికి సౌభాగ్యం*
- విశాఖపట్నం

పల్లెకు సదుపాయం… ప్రతి ఇంటికి సౌభాగ్యం*

*ప్రతి పల్లెకు సదుపాయం… ప్రతి ఇంటికి సౌభాగ్యం* *రాజోలు విశాఖ పున్నమి ప్రతినిధి:- * – రూ. 6787 కోట్ల అంచనా వ్యయంతో పల్లె పండగ 2.0 – గ్రామాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా పనులకు శ్రీకారం – రూ. 5,838 కోట్ల అంచనాతో 8,571 కిలోమీటర్ల కొత్త రహదారులు, రూ.375 కోట్లతో 25 వేల మినీ గోకులాలు – రూ. 4 కోట్ల వ్యయంతో 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్లు – ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతల బూతులు, బుద్ధులు మారడం లేదు – మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది – అబద్ధపు హామీలతో జెన్ జి యువతను మోసం చేయలేం – సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తేనే ప్రశ్నించే హక్కు ఉంటుంది – రాజోలు నియోజక వర్గం శివకోడు గ్రామంలో పల్లె పండగ 2.0 కార్యక్రమం ప్రారంభంలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ‘రాష్ట్రంలోని గ్రామాల ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో ‘పల్లె పండగ 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామ’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పేర్కొన్నారు. ‘ప్రతి పల్లెకు సదుపాయం… ప్రతి కుటుంబానికి సౌభాగ్యం’ లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా 4 వేల కిలోమీటర్లు రోడ్లు నిర్మించినట్లే, పల్లె పండగ 2.0లో రెండింతల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. పల్లె పండగ 2.0 కార్యక్రమం ద్వారా 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో రూ.6,787 కోట్ల వ్యయంతో 53,382 అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రతి గ్రామాన్ని ఒక అభివృద్ధి చిహ్నంగా తీర్చిదిద్దే సంకల్పంతో గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నామని అన్నారు. బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం శివకోడులో పల్లె పండగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. పల్లె పండగ తొలి దశకు సంబంధించి చేపట్టిన పనులు ఫొటో ఎగ్జిబిషన్‌ ద్వారా తిలకించారు.

*ప్రతి పల్లెకు సదుపాయం… ప్రతి ఇంటికి సౌభాగ్యం*
*రాజోలు విశాఖ పున్నమి ప్రతినిధి:- *
– రూ. 6787 కోట్ల అంచనా వ్యయంతో పల్లె పండగ 2.0
– గ్రామాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా పనులకు శ్రీకారం
– రూ. 5,838 కోట్ల అంచనాతో 8,571 కిలోమీటర్ల కొత్త రహదారులు, రూ.375 కోట్లతో 25 వేల మినీ గోకులాలు
– రూ. 4 కోట్ల వ్యయంతో 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్లు
– ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతల బూతులు, బుద్ధులు మారడం లేదు
– మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది
– అబద్ధపు హామీలతో జెన్ జి యువతను మోసం చేయలేం
– సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తేనే ప్రశ్నించే హక్కు ఉంటుంది
– రాజోలు నియోజక వర్గం శివకోడు గ్రామంలో పల్లె పండగ 2.0 కార్యక్రమం ప్రారంభంలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

‘రాష్ట్రంలోని గ్రామాల ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో ‘పల్లె పండగ 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామ’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పేర్కొన్నారు. ‘ప్రతి పల్లెకు సదుపాయం… ప్రతి కుటుంబానికి సౌభాగ్యం’ లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా 4 వేల కిలోమీటర్లు రోడ్లు నిర్మించినట్లే, పల్లె పండగ 2.0లో రెండింతల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. పల్లె పండగ 2.0 కార్యక్రమం ద్వారా 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో రూ.6,787 కోట్ల వ్యయంతో 53,382 అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రతి గ్రామాన్ని ఒక అభివృద్ధి చిహ్నంగా తీర్చిదిద్దే సంకల్పంతో గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నామని అన్నారు. బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం శివకోడులో పల్లె పండగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. పల్లె పండగ తొలి దశకు సంబంధించి చేపట్టిన పనులు ఫొటో ఎగ్జిబిషన్‌ ద్వారా తిలకించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.