
రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పని గంటల పెంచుతూ రాష్ట్ర శాసనసభ మరియు శాసనమండలిలో తీర్మానం చేస్తూ కార్మిక వర్గానికి ద్రోహం తలపెట్టిందని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం మన్మధరావు తీవ్రంగా ఖండించారు.
గురువారం మధురవాడ జీవీఎంసీ జోనల్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐటీయూసీ ముఠా కార్మికుల నిర్వహించిన నిరసనలో అయన మాట్లాడుతూ 135 సంవత్సరాల క్రితం కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినం ఇప్పుడు 10 గంటలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానాలు చేయడం అంటే కార్మికుల శ్రమను దోపిడీ చేయడమేనని, యజమానులకు పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించడం అత్యంత దుర్మార్గమన్నారు. ఇప్పటికే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలకు బదులు నాలుగు లేబర్ కోడ్స్ ను తీసుకొని వచ్చి కార్మికులకు తీవ్ర అన్యాయం ఇప్పటికే చేసిందని దేశంలో ఏ రాష్ట్రంలోని లేబర్ కోడ్స్ అమలు చేయకపోయినా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అత్యంత వేగంగా అమలకు పూనుకొని పని గంటలు పెంచడం కార్మికులకు తీవ్ర అన్యాయం చేయడమేనని రాష్ట్ర ప్రభుత్వం పని గంటల పెంపును ఉపశంహరించాలని
ఏఐటీయూసీ విశాఖ జిల్లా తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం పైడిరాజు, ఏరియా కార్యదర్శి వి సత్యనారాయణ ఏఐటీయూసీ ముఠా కార్మిక నాయకులు ఎం బంగారయ్య, టి అప్పలరాజు, చిన్నరావు ముఠా కార్మికులు పాల్గొన్నారు.

