పచ్చదనం పారిశుధ్యమే స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యం అని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు మునిసిపల్ పరిధిలోని 8 వ వార్డులో గల కంపోస్ట్ యార్డ్ నందు రూ. 1.12 కోట్లతో ఏర్పాటు చేయనున్న legacy waste land through Bioremidiation and Bio mining Plant (బయో రేమిడియేషన్ మరియు బయో మైనింగ్ ద్వారా వ్యర్థ భూముల పునరుద్దరణ ) ప్లాంట్ కు ఆదివారం ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. పారిశుద్ధ్యంలో పలమనేరు మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని కోరారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో ఉత్పన్నమయ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాల్సిన అవసరముందన్నారు. దీంతో పాటు పారిశుధ్యాన్ని మెరుగు పరచుకునే కార్యక్రమాలు చేపడుతూనే పచ్చదనం పై దృష్టి సారించాలన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణానికి పెట్టింది పేరైన పలమనేరును పారిశుధ్య అంశంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు మనం కృషి చేద్దామని ఆయన కోరారు. అనంతరం కంపోస్ట్ యార్డ్ లోని వివిధ యూనిట్ లను ఆయన సందర్శించారు. తడి చెత్త – పొడి చెత్తల ద్వారా తయారయ్యే సేంద్రియ ఎరువు తయారీని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్.వి. రమణారెడ్డి, మున్సిపల్ అధికారులు, సిబ్బందితో పాటు టిడిపి, జనసేన నాయకులు ఆర్వీ బాలాజీ,సుబ్రహ్మణ్యం గౌడ్, కుట్టి, గిరిబాబు, సురేష్, నాగరాజ, ఖాజా, క్రిష్ణ మూర్తి, కిరణ్, మదన్, శ్రీధర్, చాంద్ బాషా మరియు జనసేన నాయకులు దిలీప్, నాగరాజు, శివ తదితరులు పాల్గొన్నారు.
*పచ్చదనం -పారిశుధ్యమే ప్రభుత్వ లక్ష్యం* *ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ. 1.12 కోట్లతో ప్లాంట్ కు శంకుస్థాపన*