శ్రీకాళహస్తి పట్టణ ముస్లిం మైనారిటీ సోదర, సోదరీమణుల కోసం పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు సాయంత్రం భారీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మతసామరస్యానికి ప్రతీకగా నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం నేడు సాయంత్రం 6:00 గంటలకు ప్రారంభం కానుంది. ఉపవాస దీక్షల్లో ఉన్న ముస్లిం సోదరులందరూ ఈ విందుకు విచ్చేసి, సామూహిక ప్రార్థనల అనంతరం విందులో పాల్గొనాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిలువుటద్దమని, నియోజకవర్గంలోని ముస్లిం సోదరులందరితో కలిసి ఈ పవిత్ర మాసాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పట్టణంలోని ముస్లిం సోదర సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఇఫ్తార్ విందును విజయవంతం చేయాలని కోరారు.

నేడు శ్రీకాళహస్తిలో ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే ఘనంగా ఇఫ్తార్ విందు