నెల్లూరు
Date05-3-2026
ఆత్మకూరు బస్టాండ్ నుండి పెన్నా బ్రిడ్జ్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్!
నెల్లూరు: నగరంలో ట్రాఫిక్ కష్టాలు మళ్ళీ మొదటికొచ్చాయి. గురువారం ఉదయం నెల్లూరు నగరంలోని ప్రధాన రహదారులపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ముఖ్యంగా ఆత్మకూరు బస్టాండ్ నుండి పెన్నా బ్రిడ్జ్ వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
, ఆత్మకూరు బస్టాండ్,నుండి బ్రిడ్జ్ వైపు వెళ్లే మార్గాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
,ఎండ తీవ్రతకు తోడు ట్రాఫిక్ జామ్ కావడంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు మరియు అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లే వాహనాలు గంటల తరబడి రోడ్లపైనే నిలిచిపోయాయి.
, పెన్నా బ్రిడ్జ్ వద్ద పెరుగుతున్న వాహనాల రద్దీ మరియు రోడ్డుపై ఏర్పడిన చిన్నపాటి అడ్డంకులు ఈ భారీ జామ్‌కు కారణమని తెలుస్తోంది.
ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ, వాహనాల సంఖ్య భారీగా ఉండటంతో పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
Uploaded Video:



