జిల్లాగా మార్చడమే లక్ష్యంగా నెల్లూరు పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల IPS ఆదేశాల మేరకు స్కూల్స్, కాలేజీలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో 988 ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసి “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో ప్రచారం చేపట్టారు. 24 డ్రోన్లతో పర్యవేక్షణ కొనసాగిస్తూ, డ్రగ్స్ అక్రమ రవాణా మరియు వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారికి రిహాబిలిటేషన్ సెంటర్లలో కౌన్సెలింగ్ అందిస్తున్నారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయించినా లేదా వినియోగించినా డయల్ 112 లేదా ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు తెలిపారు.



