పున్నమి తెలుగు దిన పత్రిక ✍️
చిల్లకూరు వరగలి క్రాస్ రోడ్డు సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.నాయుడు పేట వైపు నుండి గూడూరుకి వెళ్తున్న బైకును లారీ వెనక నుండి ఢీకొనడంతో బైక్ వెనక కూర్చొన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ తోలుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్ధానికులు అతనిని 108 వాహనంలో గూడూరు ఏరియా హోస్పీటల్ కి తరలించారు.