జనవరి (పున్నమి ప్రతినిధి)
వైద్యరంగంలో మారుతున్న చికిత్సా విధానాలకు అనుగుణంగా నూతన వైద్య పరికరాలతో అనుభవజ్ఞులైన వైద్యులతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తోంది నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్. అనేక అరుదైన శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తూ దేశంలోనే అపోలో హాస్పిటల్స్ మొదటి స్థానంలో నిలుస్తున్నాయి. తాజాగా నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో ఓ వ్యక్తికి అరుదైన వైద్య చికిత్సను చేపట్టి ప్రాణాలను నిలబెట్టింది. కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన ఆ వైద్యం మొట్ట మొదటి సారిగా నెల్లూరులోని అపోలో బృందం విజయవంతంగా నిర్వహించింది. ఆ వివరాలను అపోలో హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తవత్సల రెడ్డి, ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ శ్రావణి రెడ్డి బుధవారం హాస్పిటల్ లో విలేకరుల సమావేశం నిర్వహించి తెలియజేశారు. కావలి పట్టణానికి చెందిన 37 సంవత్సరాల వయస్సు కలిగిన నాగరాజు అనే వ్యక్తికి నోట్లి నుండి ఆగకుండా తీవ్రమైన రక్తస్రావం అవుతుండగా వారి కుటుంబసభ్యులు అపోలో హాస్పిటల్ కు తీసువచ్చారని చెప్పారు. నాగరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు ఓ చోట ఉబ్బి ఉండటమే కాకుండా, రంధ్రం కూడా ఏర్పడి ఉన్నట్లు గుర్తించామన్నారు. దాని కారణంగా ఊపిరితిత్తులకు చేరాల్సిన రక్తం బయటకు లీక్ అవుతూ, ఆ రక్తం నోటి గుండా బయటకు వస్తున్నట్లు తెలియజేశారు. ఇలాంటి సమస్యలు చాలా అరుదుగా జరుగుతుంటాని, ఆ సమస్యకు చికిత్స కూడా కేవలం మెట్రో నగరాల్లోనే అందుబాటులో ఉంటుందని చెప్పారు. నెల్లూరు అపోలో హాస్పిటల్ లో క్లిష్టమైన సమస్యలకు కూడా వైద్య సేవలు అందించే పరికరాలతో పాటూ అనుభవజ్ఞులైన వైద్య బృందాలు అందుబాటులో ఉన్నాయని చెబుతూ రోగి నాగరాజుకు బ్రాంకిల్ ఆట్రీ ఎంబోలైజేషన్ అనే పద్ద ద్వారా చికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టామన్నారు. ఈ విధానం ద్వారా ఎక్కడైతే రక్తనాళానికి రంధ్రం పడిందో అక్కడ కాయిన్ ను అమర్చి నోట్లో నుండి వస్తున్న రక్త స్రావాన్ని నివారించామన్నారు. చికిత్సా విధానం విజయవంతంగా సాగిందని, ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకున్నారని వైద్యులు డాక్టర్ భక్తవత్సల రెడ్డి, డాక్టర్ శ్రావణి రెడ్డి తెలిపారు. ఈ తరహా చికిత్స జరగడం నెల్లూరులో ఇదే మొదటి సారి అని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బింధు భార్గవి రెడ్డి పాల్గొని, మాట్లాడారు. అన్నీ రోగాలకు నెల్లూరు అపోలో హాస్పిటల్ లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.


