Thursday, 5 February 2026
  • Home  
  • నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి* *ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే అమర్*
- చిత్తూరు

నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి* *ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే అమర్*

నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి* *ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే అమర్* నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పలమనేరు శాసనసభ్యులు ఎన్. అమరనాథ రెడ్డి ఆకాంక్షించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం జనసందోహంగా మారింది. గురువారం ఉదయం నుంచే నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు, ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలోని ప్రముఖ ఆలయాల నుండి విచ్చేసిన అర్చకులు ఎమ్మెల్యేకు వేదాశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రజలందరూ అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తనను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారికి నూతన సంవత్సరంతో పాటు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. నాయకులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి*

*ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే అమర్*

నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పలమనేరు శాసనసభ్యులు ఎన్. అమరనాథ రెడ్డి ఆకాంక్షించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం జనసందోహంగా మారింది. గురువారం ఉదయం నుంచే నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు, ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలోని ప్రముఖ ఆలయాల నుండి విచ్చేసిన అర్చకులు ఎమ్మెల్యేకు వేదాశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రజలందరూ అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తనను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారికి నూతన సంవత్సరంతో పాటు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. నాయకులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.