నిర్మల్ 30/10/25 (పున్నమి ప్రతినిధి)
నిర్మల్ జిల్లాలో గురువారం 1200.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. *ముదోల్ మండలంలో అత్యధికంగా 110.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది,* బాసర మండలంలో 104.4, లక్ష్మణ చందా 61.4, సోన్ 81.4, నిర్మల్ గ్రామీణం 62.8, నిర్మల్ పట్టణంలో 52.8, సారంగాపూర్ మండలంలో 62.2, దిలావర్పూర్ మండలంలో 32.2, లోకేశ్వరం మండలంలో 42, నర్సాపూర్ (జి) మండలంలో 35.8, కుంటాల మండలంలో 28, భైంసా మండలంలో 75.6, తానూరు మండలంలో 52.4, కుబీర్ మండలంలో 61, మామడ మండలంలో 39.4, పెంబి మండలంలో 81.6, ఖానాపూర్ మండలంలో 101.4, కడం పెద్దూర్ లో 73.2, దస్తురాబాద్ మండలంలో 42.4, మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జిల్లావ్యాప్తంగా 63.2 మిల్లీమీటర్ ల సగటు వర్షపాతం నమోదయింది. కాగా పైన తెలిపిన విధంగా మెంథా తుఫాన్ ప్రభావం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉంది, ఎడతెరిపిలేని వర్షాలు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నాయి.


