*నిరుపేద కుటుంబానికి 1,64000 వేలు
ఆర్థిక సహాయం అందచేసిన మేడిపల్లి నక్కర్త గ్రామ ప్రజలు.*
*మృతుని పిల్లలు అమ్మాయి పేరు మీద పోస్ట్ ఆఫీస్ లో పి ఎం సుకన్య యోజన పథకం కింద జమ*
పున్నమి న్యూస్ ప్రతినిధి:
24 జనవరి 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్:
*రంగారెడ్డి జిల్లా యాచారం మండల మేడిపల్లి నక్కర్త గ్రామానికి చెందిన కందడి నర్సిహ ఇటీవల ఆత్మహాత్య చేసుకున్నారు… అతని మరణం తో వారి కుటుంభం పరిస్థితి గమనించిన స్నేహితులు గ్రామ వాసులు, మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించారు. రూ.1,64000 సేకరించిన నగదును మృతుని పిల్లలు అమ్మాయి పేరు మీద పోస్ట్ ఆఫీస్ లో పి ఎం సుకన్య యోజన పథకం కింద జమ చేసి ధ్రువపత్రాలను మృతుని దశదినకర్మ రోజు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఈ లోకంలో పేద కుటుంభనికి తమ వంతుగా మిత్రుడు నరసింహ కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని గ్రామ వాసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థికసహాయ సహకారాలు అందించిన వారికీ పేరు పేరు నా..ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు



