రెండు కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ
కాకినాడ : జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ఆయన స్ఫూర్తితో కాకినాడకు చెందిన జనసేన సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం కాకినాడలోని రెండు నిరుపేద కుటుంబాలకు 2 నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు అందించారు. పట్టణంలోని జగన్నాధపురంలోని 20వ డివిజన్ లో నివసిస్తున్న కర్ర సురేష్ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులును మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) కలిసి తనప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారికి రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యవసర సరుకులను అందజేశారు. అదే విధంగా జగన్నాధపురంలోని 20వ డివిజన్ లో ఇటీవల మృతి చెందిన చింతా అంజి కుటుంబ సభ్యులును కలిసి తనప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారి కుటుంబానికి కూడా రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యవసర సరుకులు అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జనసేన వీర మహిళా మోనా మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) సేవ చేస్తున్నారని కొనియాడారు. ఇప్పటివరకు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు, కుటుంబ పెద్ద కోల్పోయిన వారికి, నిరుపేదలకు సుమారు 302 కుటుంబాలకు ఆయన నిత్యవసర సరుకులు అందించడం జరిగిందన్నారు. తన సొంత నిధులతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారని, అటువంటి వ్యక్తి 1000 వరకు కార్యక్రమాలు చేయాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఓలేటి రాము, పి.వీర్రాజు, వీరబాబు, జనసేన పార్టీ వీర మహిళలు బంటు లీల, సుజాత, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


