సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి)
జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో నాలుగేళ్ల ట్రిషా తోసర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2023లో విడుదలైన మరాఠీ చిత్రం నాల్ 2లో ‘చిమి’ పాత్రలో అద్వితీయంగా నటించి ఆమె జాతీయ ఉత్తమ బాలనటి అవార్డును గెలుచుకుంది. తన చిన్న వయస్సులోనే గొప్ప నటనా ప్రతిభను ప్రదర్శించిన ట్రిషా, ప్రేక్షకులను ఆకట్టుకుంది. వేడుకలో ఆమెకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. ఆమె నటన చిత్రానికి జీవం పోసిందని విమర్శకులు కొనియాడుతున్నారు. ఈ అరుదైన ఘనతతో ట్రిషా తోసర్ భారతీయ చలన చిత్రరంగంలో బాల నటులకి ఆదర్శంగా నిలిచింది. వేడుకలో ట్రిషా హాజరై అందరినీ మెప్పించింది.


