శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి గారిపై వైకాపా నేతలు చేస్తున్న నీచమైన వ్యాఖ్యలను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. సంస్కారం లేని రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రోజా గారు.. నోటికొచ్చినట్లు మాట్లాడటం మీ అజ్ఞానానికి నిదర్శనం. మా అమ్మ భువనేశ్వరి గారి గురించి ఇంకొకసారి తప్పుడు కూతలు కూస్తే సహించే ప్రసక్తే లేదు” అని సుధీర్ రెడ్డి హెచ్చరించారు. కుటుంబ విలువలు తెలియని వారు, మా నాయకుడి కుటుంబం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీ బాస్ జగన్ మోహన్ రెడ్డి తన సతీమణితో కలిసి ఎప్పుడైనా శ్రీవారిని దర్శించుకున్నారా?” అని ప్రశ్నించారు. ఇప్పటికైనా నోటి దురదను అదుపులో పెట్టుకోవాలని, లేదంటే భవిష్యత్తులో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హితవు పలికారు. ధర్మం కోసం, కుటుంబ విలువల కోసం నిలబడే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇలాంటి అవాకులు చవాకులను ఉపేక్షించబోవని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు.

నారా భువనేశ్వరిపై విమర్శలు చేస్తే సహించేది లేదు: ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వార్నింగ్