Sunday, 29 March 2026
  • Home  
  • నాణ్యమైన వైద్యం, వైద్య విద్యే మా పార్టీ విధానం – మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంచాలి – అదే మా పార్టీ విధానం
- విశాఖపట్నం

నాణ్యమైన వైద్యం, వైద్య విద్యే మా పార్టీ విధానం – మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంచాలి – అదే మా పార్టీ విధానం

విశాఖపట్నం డిసెంబర్ 23పున్నమి ప్రతినిధి:- – నాణ్యమైన వైద్యం, వైద్య విద్యే మా పార్టీ విధానం – మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంచాలి – అదే మా పార్టీ విధానం – ప్రైవేటీకరణ పేరుతో స్కాములకు పాల్పడితే ఉపేక్షించేదిలేదు – మేం అధికారంలోకి వస్తే ఇలాంటి వారిపై చర్యలు – మా పార్టీ అధ్యక్షుడూ ఇదే స్పష్టం చేశారు : శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టీకరణ విశాఖపట్నంలో తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్నాధ్, ఇతర వైయస్సార్సీపీ నేతలు. – డిప్యూటీ సీఎం పీకుడు భాష తీవ్ర అభ్యంతరకరం – పవన్ కళ్యాణ్ కాగితంపులి మాటలు కట్టిపెట్టండి – గోదావరి జిల్లాల్లో యథేచ్ఛగా పేకాట క్లబ్బులు – సీపోర్టుల ద్వారా లక్షల టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా – అయినా చర్యలు మాత్రం శూన్యం : సూటిగా ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ – కూటమి పాలనలో ప్రతి స్ధాయిలోనూ అవినీతి – యూరియా కొరతపై కుంటిసాకులు – యుక్రెయిన్ యుద్దం కారణమైతే దేశమంతా కొరతుండాలి – ఎన్డీయే రాష్ట్రాల్లో లేని కొరత ఏపీకే ఎందుకు? – ఏపీలో రైతుల తరపున అడిగే నాధుడేలేడు : తేల్చి చెప్పిన బొత్స సత్యనారాయణ – రియల్ ఎస్టేటే కంపెనీలకు కారుచౌకగా భూదోపిడీ – ప్రతిరోజూ పత్రికల్లో మహిళలపై అఘాయిత్యాలు, హత్యా వార్తలే – సంక్షేమ హాస్టళ్లలోనూ కొరవడిన తాగునీరు, పౌష్టికాహారం – నాడు- నేడు పథకానికి మంగళం – ముస్తాబు పేరుతో అద్దం, దువ్వెనలు – భారీగా అప్పులు- అధ్వాన్నంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి – 18 నెలల్లో రూ.2.66 లక్షల కోట్లకు పైగా అప్పులు – భారీగా విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు – నెట్ వర్క్ ఆసుపత్రులకు చెల్లించని ఆరోగ్యశ్రీ బిల్లులు – ఇది ముమ్మూటికీ అసమర్థ ప్రభుత్వమే : కూటమి పాలనపై బొత్స సత్యనారాయణ ఫైర్ పేదలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్య అందించాలన్నదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని… అందులో భాగంగా మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంచాలన్నదే మా పార్టీ విధానమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేటీకరణపేరుతో స్కాములకు మేం విరుద్దమన్న ఆయన.. మా పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ సైతం ఇదే స్పష్టం చేశారని తెలిపారు. బాధ్యతగల ప్రతిపక్షంగా ఇదే మా పార్టీ విధానమని… మేం అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ రద్దు చేయడంతో పాటు స్కాములకు పాల్పడ్డ వారిపై చర్యలు ఖాయమని స్పష్టీకరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పీకుడు భాష పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన… కాగితంపులి మాటలు కట్టిపెట్టాలని సూచించారు. గోదావరి జిల్లాల్లో యథేచ్ఛగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నా, సీపోర్టుల ద్వారా లక్షల టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కూటమి పాలనలో పేదల ఉపాధి గండం కలిగేలా… ఉపాధి హామీ చట్టం ఆబ్జెక్ట్ మార్పు చేస్తే ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కూటమి పాలనలో ప్రతి స్ధాయిలోనూ అవినీతి రాజ్యమేలుతుందని… యూరియా కొరతపై కుంటిసాకులు చెబుతున్నారని మండిపడ్డ బొత్స సత్యనారాయణ, యుక్రెయిన్ యుద్దం కారణమైతే ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో లేని కొరత ఏపీకే ఎందుకని నిలదీశారు. కేవలం ఏపీలో రైతుల తరపున అడిగే నాధుడు లేకపోవడమేనని ఆయన తేల్చి చెప్పారు. ప్రతిరోజూ పత్రికల్లో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలతో పాటు సంక్షేమ హాస్టళ్లలోనూ కొరవడిన తాగునీరు, పౌష్టికాహార వార్తలే దర్శనిమిస్తున్నాయని.. ప్రభుత్వ అసమర్ధ పాలనకు ఇదే నిదర్శనమన్నారు. 18 నెలల్లో రూ.2.66 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినా.. విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలతో పాటు, నెట్ వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా చెల్లించలేని అసమర్థ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఏమన్నారంటే.. ● క్షేత్రస్దాయికి వెళ్లి నిజాలు తెలుసుకొండి… నాలుగైదు రోజులగా అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలు, వారి భాష, ఆలోచనా విధానాన్ని రాష్ట్ర ప్రజలందరూ అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారం రోజుల క్రితం గవర్నర్ గారిని మా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్.జగన్ తో పాటు మా పార్టీ నాయకులందరం వెళ్లి కలిసాం. ప్రజారోగ్యానికి సంబంధించి మా ప్రభుత్వ హయాంలో పెట్టిన మెడికల్ కాలేజీలను స్వార్ధంతో పీపీపీ విధానంలో ప్రైవేటైజేషన్ చేస్తున్నారని… దీన్ని వ్యతిరేకిస్తూ కోటికి పైగా సంతకాలతో కూడిన ప్రజాభిప్రాయాన్ని గవర్నర్ గారికి సమర్పించాం. అనంతరం ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడిన మాటలు, వారి భాషపై ఆలోచన చేయమని ప్రజలను కోరుతున్నాను. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలుంటే కోటి మంది ఎలా సంతకాలు పెట్టారని ప్రశ్నిస్తున్నారు? అసలు రాష్ట్రంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారో మంత్రిగారికి తెలుసా? ప్రజలు ప్రభుత్వ హయాంలోనే మెడికల్ కాలేజీలు ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి, సంతకాలు చేశారు. మీరు మీకు నచ్చిన గ్రామానికి వెళ్లి… మేం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని అనుకుంటున్నాం.. ఎవరికైనా అభ్యంతరం ఉందా? అని అడిగితే ప్రజలే వాస్తవాలు చెబుతారు. ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకుంటే.. మీకే వాస్తవాలు తెలుస్తాయి. కావాలంటే మీరే ప్రజాభిప్రాయం తెలుసుకొండి, అంతే తప్ప చిన్న మాటలు మాట్లాడి మీ స్థాయి తగ్గించుకోవద్దు. ● మా పార్టీ విధానం సుష్పష్టం- అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేటీకరణ రద్దు ఖాయం.. ప్రైవేటీకరణ మీ విధానం అని ధైర్యంగా చెప్పండి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పినదేమిటంటే… ఎవరైనా ఆశపడో, అవినీతి కోసమో.. ఈ కార్యక్రమం చేస్తే మేం ప్రజల అండదండలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానాన్ని రద్దు చేస్తాం, అవినీతికి పాల్పడిన వారిపై ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. మరలో మేం మరోసారి చాలా స్పష్టంగా చెబుతున్నాను. మా పార్టీ విధానం చెబితే అది బెదిరింపు ఎలా అవుతుంది? ఉపముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు? ప్రజారోగ్యాన్ని మీ స్వలాభం కోసం మార్చుకోవాలని చూస్తే… వారిపై మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కఠిన చర్యలు తప్పవన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాం. దీనిపై సీఎం, డిప్యూటీ సీఎంతో సహా మంత్రులందరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ● పేదల ఉపాధికి గండం… మీ ఎన్నికల ప్రణాళిక అమలుతో సహా రాష్ట్రంలో చాలా సమస్యలుంటే వాటిపై మాత్రం మీరు నోరు మెదపడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. మీరు ఆ ఉద్యోగాలు ఇస్తారో చేస్తారో తెలియదు కానీ… ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టం ఆబ్జెక్ట్ మార్చడం వల్ల.. ఈ రాష్ట్రం 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లే పరిస్థితి దాపురిస్తోంది. మరలా రాష్ట్రంలో వలసలు వచ్చే తరుణం ఆసన్నమవుతోంది. గ్రామాల్లో పేద ప్రజలు ఉపాధి కోల్పోయి.. పని దొరక్క ఇబ్బందులు పడే రోజులు రానున్నాయి. ఇది వాస్తవం. ఏదైనా ఒక విధాన నిర్ణయం తీసుకున్నప్పుడు దాని పూర్వాపరాలు చర్చించి, మంచి చెడ్డలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీరు పార్లమెంటులో భేషరతుగా మద్దతిచ్చి.. దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ పేరునే తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్… దానికి సంబంధించిన శాఖ బాధ్యతలు చూస్తున్నారు. ● కూటమి పాలనలో ప్రతి స్ధాయిలోనూ అవినీతి.. మరి పేదవాడి గురించి మీ ఆలోచన ఏమైంది? మీరు ఎందుకు దాని గురించి ప్రశ్నించడం లేదు? మీకు బాధ్యత లేదా? నేను ఒక బాధ్యత కోసమే ఈ పార్టీని స్థాపించానని చెప్పే మీరు.. ఈ పేదవాడి బ్రతుకు గురించి ఎందుకు ఆలోచన చేయడం లేదు? ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు? చంద్రబాబు నాయుడుకి ఎలాగూ పేదలు అవసరం లేదు? ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కార్పొరేట్ వ్యక్తుల గురించే ఆలోచన చేస్తాడు, వారి గురించే ఆలోచిస్తాడు. పేద, మద్య తరగతి ప్రజల గురించి ఏనాడూ ఆలోచన చేయడు. మీక్కూడా పేదలు, పవన్ కళ్యాణ్ గారూ మీక్కూడా పేదల బాధలు అవసరం లేదా? ప్రశ్నిస్తానని పదే, పదే చెప్పే మీరు.. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి వైద్య ఆరోగ్యశాఖను ప్రజలకు దూరం చేస్తూ.. అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామంటే మేము బెదిరిస్తున్నామంటారా? మా పార్టీ అధికారంలోకి రాదంటూ జ్యోతిష్యాలు చెబుతున్నారు. రాజకీయ పార్టీ అన్నప్పుడు.. ఒక సిద్ధాంతపరంగా ముందుకు వెళ్తుంది. ఆ ఆలోచన, ఆ లక్షణాలు కనిపించడం లేదు? ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కింద నుంచి పై స్థాయి వరకు అవినీతితో నిండిపోతుంది. శాంతిభద్రతలు లేవు. కనీసం ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్ధులు శుభ్రమైన భోజనం తిని, చక్కగా చదువుకునే పరిస్ధితులే లేవు. ఏ అంశాన్ని తీసుకున్నా ఇదే పరిస్థితి. ● యూరియా కొరతపై కుంటిసాకులు.. డిప్యూటీ సీఎం ప్రసంగం వింటే ఏం మాట్లాడాలో తెలియడం లేదు? యుక్రెయిన్ యుద్ధం వలన రాష్ట్రంలో యూరియా ధరలు పెరిగిపోయాయని చెబుతున్నాడు. ఇది విమర్శ కాదు. ఒక వేళ యుద్దం వలనే యూరియా డిమాండ్ వస్తే ఆ కొరత భారతదేశమంతటా ఉండాలి కదా, కానీ యూపీలో యూరియా ఎలా దొరికింది? బీహార్, హర్యానా, మన పక్కనే ఉన్న ఒడిషా లో ఎలా దొరికింది? ఏపీలో మాత్రమే ఎందుకు దొరలేదు? కేవలం ఆంధ్రా, తెలంగాణాకే యుద్దం ప్రభావం వచ్చిందా? ఆంధ్రప్రదేశ్ తప్ప ఎన్టీయే ప్రభుత్వాలు ఉన్నాయో, ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయో అక్కడ మాత్రం యూరియా పుష్కలంగా దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్ లో యూరియా కొరత ఉన్నా, రైతులు ఇబ్బండి పడుతున్నా అడిగే నాధుడు లేడు కాబట్టి, వ్యవసాయం శుద్ద దండగ అనేది

విశాఖపట్నం డిసెంబర్ 23పున్నమి ప్రతినిధి:-

– నాణ్యమైన వైద్యం, వైద్య విద్యే మా పార్టీ విధానం
– మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంచాలి
– అదే మా పార్టీ విధానం
– ప్రైవేటీకరణ పేరుతో స్కాములకు పాల్పడితే ఉపేక్షించేదిలేదు
– మేం అధికారంలోకి వస్తే ఇలాంటి వారిపై చర్యలు
– మా పార్టీ అధ్యక్షుడూ ఇదే స్పష్టం చేశారు
: శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టీకరణ

విశాఖపట్నంలో తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్నాధ్, ఇతర వైయస్సార్సీపీ నేతలు.

– డిప్యూటీ సీఎం పీకుడు భాష తీవ్ర అభ్యంతరకరం
– పవన్ కళ్యాణ్ కాగితంపులి మాటలు కట్టిపెట్టండి
– గోదావరి జిల్లాల్లో యథేచ్ఛగా పేకాట క్లబ్బులు
– సీపోర్టుల ద్వారా లక్షల టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా
– అయినా చర్యలు మాత్రం శూన్యం
: సూటిగా ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ

– కూటమి పాలనలో ప్రతి స్ధాయిలోనూ అవినీతి
– యూరియా కొరతపై కుంటిసాకులు
– యుక్రెయిన్ యుద్దం కారణమైతే దేశమంతా కొరతుండాలి
– ఎన్డీయే రాష్ట్రాల్లో లేని కొరత ఏపీకే ఎందుకు?
– ఏపీలో రైతుల తరపున అడిగే నాధుడేలేడు
: తేల్చి చెప్పిన బొత్స సత్యనారాయణ

– రియల్ ఎస్టేటే కంపెనీలకు కారుచౌకగా భూదోపిడీ
– ప్రతిరోజూ పత్రికల్లో మహిళలపై అఘాయిత్యాలు, హత్యా వార్తలే
– సంక్షేమ హాస్టళ్లలోనూ కొరవడిన తాగునీరు, పౌష్టికాహారం
– నాడు- నేడు పథకానికి మంగళం
– ముస్తాబు పేరుతో అద్దం, దువ్వెనలు
– భారీగా అప్పులు- అధ్వాన్నంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి
– 18 నెలల్లో రూ.2.66 లక్షల కోట్లకు పైగా అప్పులు
– భారీగా విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు
– నెట్ వర్క్ ఆసుపత్రులకు చెల్లించని ఆరోగ్యశ్రీ బిల్లులు
– ఇది ముమ్మూటికీ అసమర్థ ప్రభుత్వమే
: కూటమి పాలనపై బొత్స సత్యనారాయణ ఫైర్

పేదలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్య అందించాలన్నదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని… అందులో భాగంగా మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంచాలన్నదే మా పార్టీ విధానమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేటీకరణపేరుతో స్కాములకు మేం విరుద్దమన్న ఆయన.. మా పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ సైతం ఇదే స్పష్టం చేశారని తెలిపారు. బాధ్యతగల ప్రతిపక్షంగా ఇదే మా పార్టీ విధానమని… మేం అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ రద్దు చేయడంతో పాటు స్కాములకు పాల్పడ్డ వారిపై చర్యలు ఖాయమని స్పష్టీకరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పీకుడు భాష పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన… కాగితంపులి మాటలు కట్టిపెట్టాలని సూచించారు. గోదావరి జిల్లాల్లో యథేచ్ఛగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నా, సీపోర్టుల ద్వారా లక్షల టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కూటమి పాలనలో పేదల ఉపాధి గండం కలిగేలా… ఉపాధి హామీ చట్టం ఆబ్జెక్ట్ మార్పు చేస్తే ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కూటమి పాలనలో ప్రతి స్ధాయిలోనూ అవినీతి రాజ్యమేలుతుందని… యూరియా కొరతపై కుంటిసాకులు చెబుతున్నారని మండిపడ్డ బొత్స సత్యనారాయణ, యుక్రెయిన్ యుద్దం కారణమైతే ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో లేని కొరత ఏపీకే ఎందుకని నిలదీశారు. కేవలం ఏపీలో రైతుల తరపున అడిగే నాధుడు లేకపోవడమేనని ఆయన తేల్చి చెప్పారు. ప్రతిరోజూ పత్రికల్లో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలతో పాటు సంక్షేమ హాస్టళ్లలోనూ కొరవడిన తాగునీరు, పౌష్టికాహార వార్తలే దర్శనిమిస్తున్నాయని.. ప్రభుత్వ అసమర్ధ పాలనకు ఇదే నిదర్శనమన్నారు. 18 నెలల్లో రూ.2.66 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినా.. విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలతో పాటు, నెట్ వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా చెల్లించలేని అసమర్థ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఏమన్నారంటే..

● క్షేత్రస్దాయికి వెళ్లి నిజాలు తెలుసుకొండి…

నాలుగైదు రోజులగా అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలు, వారి భాష, ఆలోచనా విధానాన్ని రాష్ట్ర ప్రజలందరూ అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారం రోజుల క్రితం గవర్నర్ గారిని మా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్.జగన్ తో పాటు మా పార్టీ నాయకులందరం వెళ్లి కలిసాం. ప్రజారోగ్యానికి సంబంధించి మా ప్రభుత్వ హయాంలో పెట్టిన మెడికల్ కాలేజీలను స్వార్ధంతో పీపీపీ విధానంలో ప్రైవేటైజేషన్ చేస్తున్నారని… దీన్ని వ్యతిరేకిస్తూ కోటికి పైగా సంతకాలతో కూడిన ప్రజాభిప్రాయాన్ని గవర్నర్ గారికి సమర్పించాం. అనంతరం ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడిన మాటలు, వారి భాషపై ఆలోచన చేయమని ప్రజలను కోరుతున్నాను.
రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలుంటే కోటి మంది ఎలా సంతకాలు పెట్టారని ప్రశ్నిస్తున్నారు? అసలు రాష్ట్రంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారో మంత్రిగారికి తెలుసా? ప్రజలు ప్రభుత్వ హయాంలోనే మెడికల్ కాలేజీలు ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి, సంతకాలు చేశారు. మీరు మీకు నచ్చిన గ్రామానికి వెళ్లి… మేం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని అనుకుంటున్నాం.. ఎవరికైనా అభ్యంతరం ఉందా? అని అడిగితే ప్రజలే వాస్తవాలు చెబుతారు. ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకుంటే.. మీకే వాస్తవాలు తెలుస్తాయి. కావాలంటే మీరే ప్రజాభిప్రాయం తెలుసుకొండి, అంతే తప్ప చిన్న మాటలు మాట్లాడి మీ స్థాయి తగ్గించుకోవద్దు.

● మా పార్టీ విధానం సుష్పష్టం- అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేటీకరణ రద్దు ఖాయం..

ప్రైవేటీకరణ మీ విధానం అని ధైర్యంగా చెప్పండి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పినదేమిటంటే… ఎవరైనా ఆశపడో, అవినీతి కోసమో.. ఈ కార్యక్రమం చేస్తే మేం ప్రజల అండదండలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానాన్ని రద్దు చేస్తాం, అవినీతికి పాల్పడిన వారిపై ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. మరలో మేం మరోసారి చాలా స్పష్టంగా చెబుతున్నాను. మా పార్టీ విధానం చెబితే అది బెదిరింపు ఎలా అవుతుంది? ఉపముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు? ప్రజారోగ్యాన్ని మీ స్వలాభం కోసం మార్చుకోవాలని చూస్తే… వారిపై మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కఠిన చర్యలు తప్పవన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాం. దీనిపై సీఎం, డిప్యూటీ సీఎంతో సహా మంత్రులందరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.

● పేదల ఉపాధికి గండం…

మీ ఎన్నికల ప్రణాళిక అమలుతో సహా రాష్ట్రంలో చాలా సమస్యలుంటే వాటిపై మాత్రం మీరు నోరు మెదపడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. మీరు ఆ ఉద్యోగాలు ఇస్తారో చేస్తారో తెలియదు కానీ… ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టం ఆబ్జెక్ట్ మార్చడం వల్ల.. ఈ రాష్ట్రం 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లే పరిస్థితి దాపురిస్తోంది. మరలా రాష్ట్రంలో వలసలు వచ్చే తరుణం ఆసన్నమవుతోంది. గ్రామాల్లో పేద ప్రజలు ఉపాధి కోల్పోయి.. పని దొరక్క ఇబ్బందులు పడే రోజులు రానున్నాయి. ఇది వాస్తవం. ఏదైనా ఒక విధాన నిర్ణయం తీసుకున్నప్పుడు దాని పూర్వాపరాలు చర్చించి, మంచి చెడ్డలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీరు పార్లమెంటులో భేషరతుగా మద్దతిచ్చి.. దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ పేరునే తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్… దానికి సంబంధించిన శాఖ బాధ్యతలు చూస్తున్నారు.

● కూటమి పాలనలో ప్రతి స్ధాయిలోనూ అవినీతి..

మరి పేదవాడి గురించి మీ ఆలోచన ఏమైంది? మీరు ఎందుకు దాని గురించి ప్రశ్నించడం లేదు? మీకు బాధ్యత లేదా? నేను ఒక బాధ్యత కోసమే ఈ పార్టీని స్థాపించానని చెప్పే మీరు.. ఈ పేదవాడి బ్రతుకు గురించి ఎందుకు ఆలోచన చేయడం లేదు? ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు? చంద్రబాబు నాయుడుకి ఎలాగూ పేదలు అవసరం లేదు? ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కార్పొరేట్ వ్యక్తుల గురించే ఆలోచన చేస్తాడు, వారి గురించే ఆలోచిస్తాడు. పేద, మద్య తరగతి ప్రజల గురించి ఏనాడూ ఆలోచన చేయడు. మీక్కూడా పేదలు, పవన్ కళ్యాణ్ గారూ మీక్కూడా పేదల బాధలు అవసరం లేదా?
ప్రశ్నిస్తానని పదే, పదే చెప్పే మీరు.. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి వైద్య ఆరోగ్యశాఖను ప్రజలకు దూరం చేస్తూ.. అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామంటే మేము బెదిరిస్తున్నామంటారా? మా పార్టీ అధికారంలోకి రాదంటూ జ్యోతిష్యాలు చెబుతున్నారు. రాజకీయ పార్టీ అన్నప్పుడు.. ఒక సిద్ధాంతపరంగా ముందుకు వెళ్తుంది. ఆ ఆలోచన, ఆ లక్షణాలు కనిపించడం లేదు? ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కింద నుంచి పై స్థాయి వరకు అవినీతితో నిండిపోతుంది. శాంతిభద్రతలు లేవు. కనీసం ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్ధులు శుభ్రమైన భోజనం తిని, చక్కగా చదువుకునే పరిస్ధితులే లేవు. ఏ అంశాన్ని తీసుకున్నా ఇదే పరిస్థితి.

● యూరియా కొరతపై కుంటిసాకులు..

డిప్యూటీ సీఎం ప్రసంగం వింటే ఏం మాట్లాడాలో తెలియడం లేదు? యుక్రెయిన్ యుద్ధం వలన రాష్ట్రంలో యూరియా ధరలు పెరిగిపోయాయని చెబుతున్నాడు. ఇది విమర్శ కాదు. ఒక వేళ యుద్దం వలనే యూరియా డిమాండ్ వస్తే ఆ కొరత భారతదేశమంతటా ఉండాలి కదా, కానీ యూపీలో యూరియా ఎలా దొరికింది? బీహార్, హర్యానా, మన పక్కనే ఉన్న ఒడిషా లో ఎలా దొరికింది? ఏపీలో మాత్రమే ఎందుకు దొరలేదు? కేవలం ఆంధ్రా, తెలంగాణాకే యుద్దం ప్రభావం వచ్చిందా? ఆంధ్రప్రదేశ్ తప్ప ఎన్టీయే ప్రభుత్వాలు ఉన్నాయో, ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయో అక్కడ మాత్రం యూరియా పుష్కలంగా దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్ లో యూరియా కొరత ఉన్నా, రైతులు ఇబ్బండి పడుతున్నా అడిగే నాధుడు లేడు కాబట్టి, వ్యవసాయం శుద్ద దండగ అనేది చంద్రబాబు నినాదం కాబట్టి.. ఇక్కడ యూరియా దొరకడం లేదు. దానికి యుక్రెయిన్ యుద్దం అంటూ కుంటిసాకులు చెబితే ఎలా? మీ అధికారులను యూరియా పుష్కలంగా దొరుకుతున్న రాష్ట్రాలకు పంపించి తెలుసుకొండి.

● రియల్ ఎస్టేటే కంపెనీలకు కారుచౌకగా భూదోపిడీ…

చంద్రబాబు నాయుడు ఆయన సహచరుల కన్ను విశాఖతో పాటు ఉత్తరాంధ్రాపై పడింది. ఇక్కడ భూములు దోచుకుతినే ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగా రియల్ ఎస్టేట్ సంస్దలకు ఎక్సె ప్రెస్ ఆఫ్ ఇంటరెస్ట్ లేకుండా, బహిరంగ వేలం లేకుండా కంపెనీలతో నేరుగా మాట్లాడుకుని.. ఎకరా రూ.50 నుంచి రూ.100 కోట్లు ఖరీదు చేసే భూములను 99 పైసలకు రూ.50 లక్షలకు, రూ.1 కోటికి ఇవ్వడం ఎక్కడైనా ఉందా? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇవన్నీ కచ్చితంగా తిరగదోలుతాం. వీటన్నింటిపైనా సమీక్షిస్తాం. అధికారం ఉంది కదాని.. మీ ఇష్టం వచ్చినట్లు దోచిపెడతామంటే కుదరదు. ప్రజాస్వామ్యంలో ప్రతి పనికి ఒక విధానం ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం జరగాలే తప్ప… మీ ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు. ఈ దోపిడీ గురించి మాత్రం నోరు మెదపడం లేదు.

● కాగితంపులి మాటలు కట్టిపెట్టండి…

మరోవైపు గోదావరి జిల్లాలో యధేచ్చగా పేకాట క్లబ్బులు, ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించిన బియ్యం.. సీపోర్టుల ద్వారా లక్షల టన్నుల అక్రమ రవాణా జరుగుతుంది. అన్ని పత్రికల్లో వార్తలు వస్తున్నా… ప్రభుత్వం చేతులు దులుపేసుకుంటోంది. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి.
ఈ రాష్ట్రంలో ఉన్నది ఎన్డీయో ప్రభుత్వమా? లేక వైయస్సార్సీపీ ప్రభుత్వమా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. కాగితం పులి మాటలెందుకు? ఏ రోజు చూసినా పత్రికల్లో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలే కనపడుతున్నాయి. వీటికి తోడు సంక్షేమహాస్టళ్లలో కలుషితాహార వార్తలు కనిపిస్తున్నాయి.

● భారీగా అప్పులు – అధ్వాన్నంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి..

రాష్ట్ర ఆర్దిక పరిస్థితి చూస్తే.. కేవలం 18 నెలల కాలంలోనే రూ.2.66 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారు. తెచ్చిన అప్పు ఏం చేశారంటే దానికి సమాధానం లేదు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఒక్కసారైనా సమీక్ష నిర్వహించారా? ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంది సంస్దలు కాదు, విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ బకాయిలను సకాలంలో చెల్లించకపోవడం వల్ల వైద్యం కోసం వస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెట్ వర్క్ ఆసుపత్రులు చికిత్స అందించడానికి నిరాకరిస్తున్న పరిస్ధితి. మీరే స్వయంగా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. లక్షల కోట్లు అప్పు చేసిన మీరు.. పిల్లల ఫీజు రీయింబర్స్ మెంట్ చేయడం లేదు, నెట్ వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? ఉపాధి హామీ ఇవ్వడం లేదు సరికదా.. గ్రామీణ ప్రాంతంలో 15 ఫైనాన్స్ పనులు చేయడానికి వీల్లేదని, త్వరలోనే ఉత్తర్వులిస్తామని సర్క్యులర్ జారీ చేశారు. కారణం పదవీకాలం పూర్తైపోతుంది కాబట్టి… ఈ రకమైన ఉత్తర్వులిచ్చారు. ఒకవేళ తప్పు జరిగితే అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవచ్చు కదా? అలా కాకుండా మొత్తం పనులు నిలిపివేయడమేంటి? అంటే మీ అధికార యంత్రాంగం మీద మీకు పట్టులేదు, నమ్మకమూ లేదు. ఏ కార్యక్రమం చేసినా మాకేంటి లబ్ది అన్నదే మీ విధానంగా మిగిలింది.

● మీ భాష మార్చుకొండి…

మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని కోరుతున్నాం. మీ సొంత లాభం కోసం ప్రజారోగ్యాన్ని పాడు చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. చట్టం అందరికీ సమానంగానే ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు మీరేం పీకారంటూ.. ఈ పీకుడు భాషేంటి? ఈ డైలాగులు సినిమాల్లో పనికొస్తాయి తప్ప, రాజకీయాల్లోనూ, ప్రజా జీవితంలోనూ ఇలాంటి మాటలు పనికిరావు. చేవ ఉంటే తప్పు జరిగితే నిరూపించి, చర్యలు తీసుకొండి. ఎక్కువ మాటలు చెప్పేవాళ్లకు అసలు తక్కువన్న విషయాన్ని గుర్తుంచుకొండి. మనందరం ప్రజలకు బాధ్యత వహించాలే తప్ప… కేవలం కొన్ని మీడియా సంస్దలకో, పత్రికలకే కాదు. ముఖ్యమంత్రి గారు ఈ 18 నెలల్లో మీ ప్రభుత్వంతో పాటు డిప్యూటీసీఎం, విద్య, వైద్య ఆరోగ్య శాఖతో సహా మంత్రుల మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటో తెలుసుకొండి. మాటలు మాత్రం అట్టహాసంగా చెబుతారు. గతేడాది ఇదే సీజన్ లో సంక్రాంతి నాటికి గోతులు పూడ్చాలని చంద్రబాబు చెప్పారు. మరలా ఈ సంక్రాంతికి అదే మాట చెబుతున్నారు. ఏ సంక్రాంతినాటికో మాత్రం ఆయన చెప్పరు. తగిన నిధులిస్తే గోతులు కప్పుతారు తప్ప.. డబ్బులివ్వకుండా ప్రకటనలు ఇస్తే ఎలా సాధ్యం? రాజకీయ పార్టీలకు సంయమనం అవసరం. తూలనాడ్డం మంచి సాంప్రదాయం కాదు. చట్టప్రకారం రండి, తప్పుచేస్తే చర్యలు తీసుకొండి. అంతే తప్ప అనవసర మాటలు వల్ల ఉపయోగం లేదు. నేను లేస్తే మనిషిని కాదన్న మాటలు ఆపండి. ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టి.. సమస్యల పరిష్కారం చేయండి.

● తాగునీళ్లివ్వలేని అసమర్ధ ప్రభుత్వంలో ముస్తాబు పేరుతో అద్దం, దువ్వెనలా…

ప్రభుత్వం తాజాగా ముస్తాబు అనే కార్యక్రమం తీసుకొచ్చి స్కూళ్ళలో అద్దం, దువ్వెన పెట్టాలని నిర్ణయించింది. నాడు -నేడు లాంటి అద్భుతమైన కార్యక్రమాలను అటకెక్కించి.. స్కూళ్ళలో కనీసం తాగునీరు సరఫరా చేయలేని ఈ అసమర్థ ప్రభుత్వం ముస్తాబు కార్యక్రమం నిర్వహిస్తామని చెబుతున్నారు. అంతకంటే ముందు నాడు నేడు పనులు మరలా ప్రారంభించి.. పిల్లలకు సురక్షిత తాగునీరు, కలుషితం కాని ఆహారం ఇచ్చి అప్పుడు ముస్తాబుచేస్తే బాగుంటుంది.

● అనంతరం పాత్రికేయల ప్రశ్నలకు బదులిస్తూ….

కూటమి ప్రభుత్వం భూ కేటాయింపులపై న్యాయ పోరాటం చేస్తున్నాం. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎకరా రూ.1 కోటికే ఎలా కేటాయిస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు.. కేటాయింపులు చేస్తే చూస్తూ ఊరుకోవాలా..?
అందుకే న్యాయస్థానాలకు వెళ్లాం. లులూకు ఓపెన్ ఆక్షన్ లేకుండా నేరుగా భూములు ఎలా కేటాయిస్తారు? అని ప్రశ్నించారు.
మెడికల్ కాలేజీల ప్రైవైటీకరణకు వ్యతిరేకంగా కోటిమందికి పైగా ప్రజలు సంతకాలు చేశారు.
గతంలో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ విషయంలో నానా రాద్దాంతం చేశారు. సెకీ తో మా ప్రభుత్వ ఒప్పంధాన్ని తప్పు పట్టారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ధరకు విద్యుత్ కొంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి..?
జీవీఎంసీ మేయర్ మార్పు విషయంలో రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని చాలెంజ్ చేస్తాం. జీవీఎంసీ కార్పొరేటర్ల పార్టీ మార్పుపై అధికారులు సరైన నిర్ణయం తీసుకోలేదు. మళ్ళీ కోర్టుకు వెళ్తాం. ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి అధికారులు తలోగ్గారు అని బొత్స స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ , జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు , శాసన మండలి సభ్యులు కుంభ రవి బాబు, మాజీ శాసనసభ సభ్యులు చింతలపూడి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.