పాత కక్షల దాడి కేసు – రిమాండ్‌కు తరలింపు
చిట్వేల్, డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి
చిట్వేల్ మండలంలో పాత కక్షల నేపథ్యంలో మన్నూరు పవన్ కుమార్ రెడ్డిపై చాకుతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు.డిసెంబర్ 2, బుధవారం సాయంత్రం నాగవరం గ్రామంలో జరిగిన ఈ హత్యాయత్నం కేసులో నిందితుడైన జగదాబి ప్రసాద్ రాజు వయస్సు: 38 తండ్రి: లేట్ నాగ రాజు, కులం: క్షత్రియ, వృత్తి: వ్యవసాయం, నివాసం: దేవుని నాగవరం)ను పోలీసులు అరెస్ట్ చేశారు.రైల్వే కోడూరు సీఐ శ్రీనివాసులు గారి ఆదేశాల మేరకు, చిట్వేల్ పోలీస్ స్టేషన్ ఏఎస్సై యంగయ్య ఆధ్వర్యంలో పోలీసు బృందం గురువారం మధ్యాహ్నం నిందితుడిని అరెస్ట్ చేసింది.అరెస్టు చేసిన అనంతరం, ముద్దాయి జగదాబి ప్రసాద్ రాజు ను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించినట్లు చిట్వేల్ పోలీసులు తెలియజేశారు. గతంలో జరిగిన భూ వివాదాలు, పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు ధ్రువీకరించారు.


