నన్నయ్య విశ్వవిద్యాలయం 16వ, – 17వ స్నాతకోత్సవాలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరునన్నయ్య విశ్వవిద్యాలయం 16వ మరియు 17వ స్నాతకోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం హాజరయ్యారు.
ఉదయం సుమారు 11 గంటల సమయంలో రాజానగరం సమీపంలోని గైట్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్న గవర్నర్‌కు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో స్వాగత ఏర్పాట్లు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి. నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ కుమార్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జీజీయూ చాన్సలర్ కె.వి.వి. సత్యనారాయణ రాజు, నన్నయ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.వి. స్వామి తదితరులు గవర్నర్‌కు స్వాగతం పలికారు.అనంతరం హెలిప్యాడ్ నుంచి నన్నయ్య విశ్వవిద్యాలయానికి గవర్నర్ బయలుదేరారు.
స్నాతకోత్సవ వేదిక వద్ద వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎస్. ప్రసన్న శ్రీ, ముఖ్య అతిథి ప్రొఫెసర్ మహేంద్ర పి. లామా, ఏపీఎస్సీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ కొత్త మధు మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.వి. స్వామి, యూనివర్సిటీ అధ్యాపకులు తదితరులు గవర్నర్‌ను ఆహ్వానించారు.
స్నాతకోత్సవ వేడుకలు ముగిసిన అనంతరం గవర్నర్ తిరిగి గైట్ ఇంజినీరింగ్ కాలేజ్‌కు చేరుకుని స్వల్ప విరామం తీసుకున్న తర్వాత విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి. నరసింహ కిషోర్, జేసి వై మేఘా స్వరూప్, కమిషనర్ రాహుల్ మీనా, జీజీయూ చాన్సలర్ కె.వి.వి. సత్యనారాయణ రాజు, తదితరులు గవర్నర్‌కు ఘన వీడ్కోలు పలికారు.

నన్నయ్య విశ్వవిద్యాలయం 16వ & 17వ స్నాతకోత్సవ వేడుకలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరు
నన్నయ్య విశ్వవిద్యాలయం 16వ, – 17వ స్నాతకోత్సవాలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరునన్నయ్య విశ్వవిద్యాలయం 16వ మరియు 17వ స్నాతకోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం హాజరయ్యారు. ఉదయం సుమారు 11 గంటల సమయంలో రాజానగరం సమీపంలోని గైట్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్న గవర్నర్‌కు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో స్వాగత ఏర్పాట్లు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి. నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ కుమార్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జీజీయూ చాన్సలర్ కె.వి.వి. సత్యనారాయణ రాజు, నన్నయ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.వి. స్వామి తదితరులు గవర్నర్‌కు స్వాగతం పలికారు.అనంతరం హెలిప్యాడ్ నుంచి నన్నయ్య విశ్వవిద్యాలయానికి గవర్నర్ బయలుదేరారు. స్నాతకోత్సవ వేదిక వద్ద వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎస్. ప్రసన్న శ్రీ, ముఖ్య అతిథి ప్రొఫెసర్ మహేంద్ర పి. లామా, ఏపీఎస్సీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ కొత్త మధు మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.వి. స్వామి, యూనివర్సిటీ అధ్యాపకులు తదితరులు గవర్నర్‌ను ఆహ్వానించారు. స్నాతకోత్సవ వేడుకలు ముగిసిన అనంతరం గవర్నర్ తిరిగి గైట్ ఇంజినీరింగ్ కాలేజ్‌కు చేరుకుని స్వల్ప విరామం తీసుకున్న తర్వాత విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి. నరసింహ కిషోర్, జేసి వై మేఘా స్వరూప్, కమిషనర్ రాహుల్ మీనా, జీజీయూ చాన్సలర్ కె.వి.వి. సత్యనారాయణ రాజు, తదితరులు గవర్నర్‌కు ఘన వీడ్కోలు పలికారు.

