పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్
06 ఏప్రిల్ 2026
రంగారెడ్డి జిల్లా నియోజకవర్గం యాచారం మండలంలోని నక్కర్త మేడిపల్లి లో
ఆలయ పునర్నిర్మాణానికి భారీ విరాళం
నక్కర్త హనుమాన్ దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ నిర్మాణానికి దాతలు ముందడుగు వేశారు. ఆలయ నిర్మాణానికి జాల స్వాతి నాగరాజు దంపతులు రూ.5 లక్షల విరాళాలు ఇచ్చేందుకు అంగీకరించారు. ఇందులో మొదటి విడతగా రూ.2 లక్షల విరాళాన్ని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు. మానవ ఆధ్యాత్మిక దైనందిన చింతనకు, ఆలయాల నిర్మాణాలకు దాతలు ముందుకు రావాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. దాతకు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


