అనకాపల్లి జిల్లా, మార్చి 23 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): నక్కపల్లి మండలంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్కలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (AMNS) ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర మంత్రులు హాజరై కార్యక్రమానికి విశేష ప్రాధాన్యతను తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తుందని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని తెలిపారు.
ఏటికొప్పాక గ్రామం నుంచి ఎలమంచిలి నియోజకవర్గానికి చెందిన జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రజల ఉత్సాహం మధ్య జరిగిన ఈ భూమి పూజ కార్యక్రమం నక్కపల్లి ప్రాంతానికి ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది



