Friday, 27 March 2026
  • Home  
  • నంద్యాలలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొని క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎన్ఎండి ఫరూక్
- Blog

నంద్యాలలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొని క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎన్ఎండి ఫరూక్

నంద్యాల పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయం బుధవారం క్రిస్మస్ వేడుకలతో సందడిగా మారింది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ క్రైస్తవ నాయకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వేడుకల్లో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేక్ కట్ చేసి, అక్కడికి విచ్చేసిన క్రైస్తవ సోదరులకు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ లోక రక్షకుడు ఏసుక్రీస్తు జన్మించిన రోజైన క్రిస్మస్, శాంతి మరియు కరుణకు చిహ్నమని కొనియాడారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి పండుగలు జరుపుకోవడం సంతోషదాయకమని ఆయన పేర్కొన్నారు. అనంతరం క్రైస్తవ నాయకులు మంత్రి ఫరూక్ ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృపాకర్, ప్రభుదాస్, జోసఫ్, జార్జ్, శరత్, ఎబినేజర్, బుగ్గ రాముడు, నాగేశ్వరావు, ఫిలిప్, సురేష్ పాల్ ,మల్లెల భాస్కర్, స్టీవెన్, చంద్రశేఖర్, దీపక్ మరియు టిడిపి క్రైస్తవ ముఖ్య నాయకులు, క్రైస్తవ మత పెద్దలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

నంద్యాల పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయం బుధవారం క్రిస్మస్ వేడుకలతో సందడిగా మారింది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ క్రైస్తవ నాయకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వేడుకల్లో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేక్ కట్ చేసి, అక్కడికి విచ్చేసిన క్రైస్తవ సోదరులకు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ లోక రక్షకుడు ఏసుక్రీస్తు జన్మించిన రోజైన క్రిస్మస్, శాంతి మరియు కరుణకు చిహ్నమని కొనియాడారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి పండుగలు జరుపుకోవడం సంతోషదాయకమని ఆయన పేర్కొన్నారు. అనంతరం క్రైస్తవ నాయకులు మంత్రి ఫరూక్ ని ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృపాకర్, ప్రభుదాస్, జోసఫ్, జార్జ్, శరత్, ఎబినేజర్, బుగ్గ రాముడు, నాగేశ్వరావు, ఫిలిప్, సురేష్ పాల్ ,మల్లెల భాస్కర్, స్టీవెన్, చంద్రశేఖర్, దీపక్ మరియు టిడిపి క్రైస్తవ ముఖ్య నాయకులు, క్రైస్తవ మత పెద్దలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.