నంద్యాల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి ఫరూక్.
నంద్యాల: న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు నంద్యాల మున్సిపల్ కమిషనర్‌తో తన కార్యాలయం (రాజ్ టాకీస్) వద్ద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. పట్టణంలో ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

